తెలంగాణలోని బుధవారం నుండి ఉష్ణోగ్రత మరింత తగ్గుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)-హైదరాబాద్, ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు రాబోయే వారంలో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఐఎండీ హైదరాబాద్ తెలంగాణలోని పలు జిల్లాలకు చలిగాలుల హెచ్చరికను మరో రెండు రోజులు పొడిగించింది.

ఆదిలాబాద్ , కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో సహా అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది .
ఐఎండీ హైదరాబాద్ జారీ చేసిన తీవ్రమైన చలిగాలుల హెచ్చరిక శుక్రవారం, డిసెంబర్ 12, 2025 వరకు కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత మరికొన్ని రోజులు కూడా తీవ్రమైన చలి ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్, భువనగిరితో సహా పరిసర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు వెదర్ రిపోర్ట్ అంచనా వేశారు. బుధవారం రాత్రి నుండి తెలంగాణ అంతటా చలిగాలులు, తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గవచ్చని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలులు రాబోయే 4 నుండి 5 రోజుల వరకు కొనసాగుతాయని అన్నారు.
హైదరాబాద్, చుట్టుపక్కల అనేక ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శివార్లలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో) మొయినాబాద్ (6.6), ఇబ్రహీంపట్నం (7.7), శేరిలింగంపల్లి (8.4), రాజేంద్రనగర్ (9.2), మౌలాలి (9.4), బిహెచ్ఇఎల్ (10.5), గచ్చిబౌలి (11.4), కుత్బుల్లాపూర్ (11.9) లలో ఉన్నాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి.
{{/usCountry}}హైదరాబాద్, చుట్టుపక్కల అనేక ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శివార్లలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో) మొయినాబాద్ (6.6), ఇబ్రహీంపట్నం (7.7), శేరిలింగంపల్లి (8.4), రాజేంద్రనగర్ (9.2), మౌలాలి (9.4), బిహెచ్ఇఎల్ (10.5), గచ్చిబౌలి (11.4), కుత్బుల్లాపూర్ (11.9) లలో ఉన్నాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి.
{{/usCountry}}