...
...
Next Story

TGPSC Recruitment : టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - 86 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల, ఈనెల 24 నుంచి దరఖాస్తులు

TGPSC DIET Lecturer Notification 2026 : పాఠశాల విద్యాశాఖలోని డైట్ కాలేజీల్లో 86 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 24 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 18, 2026 05:52 PM IST
Advertisement

TGPSC DIET Lecturer Recruitment 2026 : నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో తీపి కబురు అందించింది. ఇటీవలనే పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ… తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 86 పోస్టులు…

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

నోటిఫికేషన్ ద్వారా డైట్ కళాశాలల్లో మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు కేటగిరీలుగా విభజించారు.

  • సీనియర్ లెక్చరర్లు: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని డైట్ సంస్థలలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు.
  • లెక్చరర్లు: వివిధ సబ్జెక్టులకు సంబంధించి డైట్ సంస్థలలో 63 లెక్చరర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే

ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి షురూ అవుతుంది. జూలై 29వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 24, 2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది.
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 29, 2026 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.tgpsc.gov.in

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe