కాకినాడ జిల్లాలో తునిలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఓ స్థానికుడు అతడిని ప్రశ్నించగా… వెంటనే సదరు వ్యక్తి అక్కడ్నుంచి జారుకున్నాడు.

తుని రూరల్ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను నారాయణ రావు అనే వ్యక్తి హాస్టల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లాడు. సమీపంలోని హంసవరం సపోటా తోటల్లో తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా తాకాడు. అత్యాచారం చేసేందుకు యత్నించబోయినట్లు తెలిసింది.
ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని ఓ స్థానికుడు గమనించాడు. అతని వద్దకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. బాలికను తోటలోకి తీసుకొచ్చి అత్యాచారం చేస్తున్నావా అని నిలదీశాడు. అలాంటిదేమీ లేదు… బాలికను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని దబాయించాడు. అంతటితో ఆగని నారాయణరావు… తాను ఓ పార్టీ కౌన్సిలర్‌ను అంటూ చెప్పుకొచ్చాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తుండగానే… స్కూటీపై సదరు బాలికను ఎక్కించుకోని నారాయణరావు వెళ్లిపోయాడు. ఇదంతా కూడా వీడియోల రికార్డు అయింది.
హాస్టల్ నుంచి మైనర్ బాలికను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ఓ ట్వీట్ టేసింది. తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి.. హంసవరం సపోటా తోటలో టీడీపీ నేత నారాయణ రావు అత్యాచారయత్నం చేశాడని పేర్కొంది. కీచకుడి బాగోతాన్ని గుర్తించి బాలికను స్థానికుడు రక్షించాడని తెలిపింది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై టీడీపీ నేతల వేధింపులకి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ ప్రశ్నించింది. వీడియోను కూడా ఇందుకు జత చేసింది.
పార్టీలో అతనికి ఏ పదవీ లేదు - టీడీపీ
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. “సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు” అని స్పష్టం చేసింది.
{{/usCountry}}ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. “సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు” అని స్పష్టం చేసింది.
{{/usCountry}}