...
...
Next Story

ఏపీలో ఆల్ ఇన్ వన్ కార్డ్.. జూన్ నాటికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Published on: Nov 24, 2025, 21:39:24 IST
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌(FBMS) ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను అందించడానికి ఒకే యూనిట్‌గా పరిగణించే సమగ్ర డేటా ఆధారిత ఫ్రేమ్‌వర్క్ అన్నమాట జూన్ 2026 నాటికి 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

సచివాలయంలో ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు డేటా ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేసి స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ఈ మేరకు ప్రభుత్వం జారీ చేస్తుంది.

టీకాలు, ఆధార్, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పోషకాహార ఆహారం, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్ వివరాలు వంటి వివరాలతో కార్డులు సమగ్ర స్టాటిక్, డైనమిక్ డేటాను అందులో పెట్టనున్నారు. 25 రకాల వివరాలతోపాటుగా పీ4లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలను మాత్రమే ఎఫ్‌బీఎంఎస్‌ వ్యవస్థను పరిమితం చేయెుద్దని చెప్పారు.

ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవల డేటాను నవీకరించాలని, వాటిని స్మార్ట్ ఫ్యామిలీ కార్డులలో చేర్చాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పౌరులు ఒకే కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు, పథకాలను పొందాలని అన్నారు.

ప్రజలకు అందిస్తున్న అన్ని సేవల వివరాలు కుటుంబ కార్డులలో కనిపించాలని ముఖ్యమంత్రి అన్నారు. కుటుంబ కార్డులు పౌర సేవలను పారదర్శకంగా అందించడం, అదే సమయంలో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో సహాయపడతాయని చెప్పారు. సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహాయపడతాయని తెలిపారు. కుటుంబ కార్డులు ద్వారా ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలను పొందగలుగుతారన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe