...
...
Next Story

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీలివిగో

ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత కౌన్సెలింగ్ జరుగుతోంది. అయితే తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా షెడ్యూల్ లో మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Oct 29, 2025, 11:11:22 IST
Advertisement

ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ తో కౌన్సెలింగ్ తేదీల గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.

కొత్త తేదీలు….

ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు 2025
ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు 2025

కొత్త షెడ్యూల్ ప్రకారం.... ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 1వ తేదీ వరకు సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇక నవంబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ 4వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఈ థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబరు 7లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

అలాట్ మెంట్ ఇలా పొందొచ్చు…

  1. విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. మీ ఈమెయిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ కావాలి.
  3. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీటు కేటాయించారనేది డిస్ ప్లే అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియను పూర్తి చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks