ఏపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

{{^htLoading}} {{/htLoading}}
అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 4వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 29వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు.
ముఖ్య వివరాలు:
- అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకటన - గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- అడ్మిషన్ తరగతి - ఆరో తరగతిలో ప్రవేశాలకు
- 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలోని ఆరో తరతగతిలో 60 సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 1,680 (840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి.
- అర్హతలు - ఐదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
- విద్యార్థి వయసు 10 నుంచి 13 ఏళ్ల లోపు ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 5 ఫిబ్రవరి 2026
- దరఖాస్తులకు చివరి తేదీ -28 ఫిబ్రవరి 2026
- హాల్ టికెట్లు విడుదల - 10 మార్చి 2026
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ - 4 మార్చి 2026
- ఎంపిక విధానం - రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
- ఫస్ట్ మెరిట్ లిస్ట్ - 24 మార్చి 2026
- తుది ఫలితాలు (ఎంపికైన విద్యార్థుల జాబితా) 29 మార్చి 2026
- ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉంటుంది.
- ఎంట్రెన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలో ప్రశ్నాపత్రం ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://aptwgurukulam.ap.gov.in/
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}