పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు...అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు..విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సూచించారు.
26 ప్రతిపాదనలకు ఆమోదం….

శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. వీటి ద్వారా రూ. 1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి.
గడిచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి" అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. “చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని... క్లస్టర్ వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలి”అని ముఖ్యమంత్రి సూచించారు.
పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్దం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకు వస్తే.. అలాంటి వారిని ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలో 3 మెగా సిటీలు - సీఎం చంద్రబాబు
{{/usCountry}}పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్దం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకు వస్తే.. అలాంటి వారిని ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలో 3 మెగా సిటీలు - సీఎం చంద్రబాబు
{{/usCountry}}“రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలి. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలి. ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలి. ఈ మేరకు టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలి" అని సీఎం చంద్రబాబు వివరించారు.
"రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. దీనికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తాం. బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి”అని సీఎం చెప్పారు.
ఈ నెల, 14,15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనల్లో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులను భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించానని.. వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు.