...
...
Next Story

AP SSC Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలపై అప్‌డేట్ - ముగిసిన మూల్యాంకనం, రిజల్ట్స్ ఎప్పుడంటే..?

AP SSC Results 2026 : ఏపీ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. ప్రస్తుతం ఫలితాలను ప్రాసెస్ చేస్తున్నారు. సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు.

Published on: Apr 17, 2026, 12:47:39 IST
Advertisement

ఏపీ టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి అయిన సంగతి తెలిసిందే. విద్యార్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలుపెట్టిన జవాబు పత్రాల మూల్యాంకనం కూడా తాజాగానే పూర్తి అయింది.

స్పాట్ వాల్యూయేషన్ పూర్తి….

ఏపీ టెన్త్ పరీక్షలు 2026
ఏపీ టెన్త్ పరీక్షలు 2026

రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేశారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ… చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

మూల్యాంకనం పూర్తి అయినే నేపథ్యంలో ప్రస్తుతం మార్కులను ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. అంతా సవ్యంగా ఉంటే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ఫలితాల వివరాలను వెల్లడిస్తారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షలు జరిగాయి. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడు..?

ఏపీ పదో తరగతి ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే… మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks