ఏపీ టెట్ - 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకువచ్చిన విద్యాశాఖ… అభ్యంతరాలను కూడా స్వీకరించింది. వీటి పరిశీలన పూర్తి కావటంతో… ఇవాళ ఫైనల్ కీలను విడుదల చేసింది.
ఏపీ టెట్ ఫైనల్ కీలు - డౌన్లోడ్ ప్రాసెస్
- ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Initial Keyతో పాటు ఫైనల్ కీ ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది.
- ఫైనల్ కీ లింక్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మీ సబ్జెక్ట్ ఫైనల్ కీని పొందవచ్చు.

మరోవైపు ఏపీ టెట్ ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఈనెల 19వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆ దిశగానే విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా… డిసెంబర్ 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… ఆ తర్వాత మిగతా పేపర్ల ప్రాథమిక కీలను కూడా ప్రకటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. పరిశీలించిన తర్వాత ఇవాళ (జనవరి 9) ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఏపీ టెట్ - 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- ఏపీ టెట్ అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి వివరాలతో లాగిన్ కావాలి.
- సబ్మిట్ చేస్తే అభ్యర్థి సాధించిన స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీలను పొందవచ్చు.