...
...
Next Story

ఏపీ టెట్ నోటిఫికేషన్ 2025 : దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి

ఏపీ టెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. నవంబర్ 23వ తేదీ వరకు అభ్యర్థులు ప్రాసెస్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

Published on: Oct 26, 2025 06:05 AM IST
Advertisement

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 23, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇదే తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు.

ఏపీ టెట్ దరఖాస్తులు 2025
ఏపీ టెట్ దరఖాస్తులు 2025

విద్యాశాఖ తెలిపిన షెడ్యూల్ వివరాల ప్రకారం…. మాక్ టెస్ట్ ఆప్షన్ నవంబర్ 25, 2025న అందుబాటులోకి వస్తుంది. హాల్ టిక్కెట్లు డిసెంబర్ 3, 2025 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

ఏపీ టెట్ పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ఏపీ టెట్ 2025 - అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..

  1. అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని కనిపించే రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ ప్రాసెస్ తర్వాత నిర్ణయించిన ఫీజును చెల్లించుకోవాలి.
  4. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేసుకోవాలి.
  5. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. ఫైనల్ గా సబ్మిట్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  7. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe