...
...
Next Story

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫైనల్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ లిస్ట్ చూసేయండి!

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉండగా.. ఎట్టకేలకు పైనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేశారు.

Published on: Jan 28, 2026 07:47 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పోర్టల్‌లో విడుదల చేసింది. మెుత్తం 905 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. క్రీడా కోటాకు సంబంధించి.. గ్రూప్ 2లో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్ఛికాల మేరకు ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్ఓ పోస్టులు పక్కన ఉన్నాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితా విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితా విడుదల

25 పోస్టుల్లో రిజర్వేషన్ ప్రకారం మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన 866 పోస్టుల్లో ఎలాంటి మార్పు జరగదు. ప్రకటించని 14 పోస్టులు, క్రీడా కోటా రెండు పోస్టులు, 7 దివ్యాంగ, 5 రిజర్వేషన్ పోస్టులకు సంబంధిత కేటగిరీల్లో అభ్యర్థులు లేరు.

గ్రూప్‌-2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబరు 7న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ జరిగాయి. 2025 ఫిబ్రవరి 23న మెయిన్‌ పరీక్షలు రాశాలు. 2025 ఏప్రిల్‌ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. తర్వాత కోర్టు కేసుల దృష్ట్యా అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి సమయం పట్టింది.

ఈ లింక్ క్లిక్ చేసి తుది ఎంపిక జాబితా చూడండి.

గ్రూప్ 2 సర్వీసుల కిందకు వచ్చే పోస్టుల కోసం ప్రధాన పరీక్ష నుండి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష, వైద్య పరీక్షల తర్వాత వారు ఎంచుకున్న పోస్టులు/జోన్‌లు/జిల్లాల ప్రాధాన్యతల ప్రకారం తాత్కాలికంగా ఎంపిక చేసినట్టుగా కమిషన్ తాజాగా పేర్కొంది. ఈ ఎంపికలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు లోబడి ఉంటాయని తెలిపింది.

అభ్యర్థి నిబంధనలు/నోటిఫికేషన్ ప్రకారం నియామక అధికారి కోరిన అసలు ధృవపత్రాలను సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చారని లేదా అభ్యర్థి ఎంపిక సక్రమంగా జరగలేదని కమిషన్ దృష్టికి వస్తే ఏ దశలోనైనా రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. చర్యలు తీసుకుంటారు.

మిగిలిపోయిన ఖాళీలకు ఎంపికలు, నోటిఫికేషన్ షరతులు/మెయిన్స్ పరీక్షలో అర్హత గల అభ్యర్థుల ఫలితాల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న నియమాలు, విధానాల ప్రకారం విడిగా కమిషన్ సమీక్షించనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe