...
...
Next Story

పక్కాగా ఖరీఫ్ పంట ప్రణాళిక..! గోదావరి, కృష్ణా డెల్టాకు ముందుగానే సాగునీరు

తుఫాను ముప్పు తప్పేలా ముందుగానే ఖరీఫ్ సాగుకు ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. 365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు చేపట్టింది. వ్యవయసాయశాఖపై తాజాగా సమీక్షించిన సీఎం చంద్రబాబు… కృష్ణా, గోదావరి డెల్టాకు నీటి విడుదలపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Published on: Jun 11, 2025, 11:25:20 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు.

ప్రణాళికలు సిద్ధం…

డెల్టాకు నీటి విడుదల
డెల్టాకు నీటి విడుదల

మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.

రాష్ట్రంలో ఖరీఫ్సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా... వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని పేర్కొన్నారు. కందుల సాగుమాత్రం పెరిగిందని… వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

20 ఏళ్లల్లో 14 తుఫాన్లు…

గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 14 తుఫాన్లను ఎదుర్కొంది. వీటిలో 5 తుఫాన్లు అక్టోబర్‌లో, 6 తుఫాన్లు నవంబర్‌లో, 3 తుఫాన్లు డిసెంబర్‌లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి. అక్టోబర్‌లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ల ప్రభావం తగ్గేలా ఖరీఫ్ సాగు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా చూడాలని... ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు… అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని...దీనివల్ల భూసారం దెబ్బతింటోందని ప్రస్తావించారు. అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని చెప్పారు.

సన్నాలను ప్రోత్సహించండి - సీఎం చంద్రబాబు

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పర్చూరు ఏఎంసీలో ప్రారంభించామని, దీనిపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెచ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖకు సంబంధించి 3 సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

ఎరువుల వినియోగం తగ్గాలి - సీఎం చంద్రబాబు

ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబుసూచించారు. భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe