...
...
Next Story

AP Inter Results 2026 : మీ వాట్సాప్‌కే నేరుగా ఏపీ ఇంటర్ ఫలితాలు - మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే చాలా సులభంగా విద్యార్థులు… 'మన మిత్ర' వాట్సాప్(95523 00009) ద్వారా నేరుగా మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.

Published on: Apr 15, 2026 06:53 AM IST
Advertisement

AP Inter Results 2026 in Manamitra Whatsapp : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఉదయం 10:31 గంటలకు అందుబాటులోకి వచ్చాయి.

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు (image source istock)
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు (image source istock)

ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 10,57,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5.31 లక్షలుకాగా… సెకండియర్ విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు. అయితే కేవలం ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోనే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ ద్వారా మొబైల్ లోనే సులభంగా తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లపై ట్రాఫిక్ పెరిగి సర్వర్లు మొరాయిస్తుంటాయి. కానీ మనమిత్ర వాట్సాప్ ద్వారా అలాంటి సమస్య రాకపోవచ్చు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షణాల్లో తమ మొబైల్‌లోనే మార్కుల మెమోను పొందవచ్చు.

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు పొందే విధానం:

  1. మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
  2. వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
  3. వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
  4. ఆ తర్వాత "AP Inter Results 2026" పై క్లిక్ చేయండి.
  5. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ రిజల్ట్ మెమో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.

వాట్సాప్ మాత్రమే కాకుండా resultsbie.ap.gov.in, bie.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదలైన నేపథ్యంలో మార్కుల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ షెడ్యూల్ ఖరావుతుంది. ఒకవేళ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ వివరాలను కూడా ఇంటర్ బోర్డు వెల్లడిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

జవాబు ; ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదలవుతాయి.

2. వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ చూసుకోవడం ఎలా?

మీరు 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపి, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మార్కుల మెమోను పొందవచ్చు.

3. ఒరిజినల్ మార్కుల మెమో ఎప్పుడు ఇస్తారు?

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇచ్చేది కేవలం ప్రొవిజనల్ మెమో మాత్రమే. ఒరిజినల్ మార్క్స్ మెమోలను ఫలితాలు వెల్లడైన 15 నుంచి 20 రోజుల తర్వాత సంబంధిత కళాశాలల నుంచి విద్యార్థులు తీసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe