...
...
Next Story

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - నవంబర్ నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను వెల్లడించింది. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ, నవంబర్ 15న సర్వ ఏకాదశి నిర్వహిస్తారు. పూర్తి లిస్ట్ ను ఇక్కడ చూడండి….

Published on: Oct 31, 2025, 10:07:47 IST
Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే నవంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి ఉంటుందని పేర్కొంది.నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఉండగా… నవంబర్ 9న కార్తీక వన భోజనం నిర్వహిస్తారు. నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం ఉంటుంది.

నవంబర్ నెలలో విశేష పర్వదినాలు:

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

• నవంబర్ 1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

• నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.

• నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ.

• నవంబర్ 9న కార్తీక వన భోజనం.

• నవంబర్ 15న సర్వ ఏకాదశి.

• నవంబర్ 17న ధన్వంతరి జయంతి.

• నవంబర్ 18న మాస శివరాత్రి.

• నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం.

వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం:

తిరుమలలో ఇవాళ వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.

భజనమండళ్ల స‌భ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

ఇవాళ మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.న‌వంబ‌రు 1న ఉద‌యం 8.30 గంట‌ల‌కు సామూహిక నామ సంకీర్త‌న‌, ఉద‌యం 9.30 గంట‌ల నుండి స్వామిజీలు ధార్మిక సందేశ‌ము ఇవ్వ‌నున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe