తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం…. ఇవాళ(05-11-2025) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. అకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు బాపట్లలో 61.5మిమీ, నంద్యాల(జి) నందికొట్కూరులో 51.7మిమీ, బొల్లవరంలో 43.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో ఇలా…
ఇక తెలంగాణలోనూ రెండు మూడు రోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 08.30 గంటలలోపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఇవాళ ఉదయం 08.30 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. రేపు కూడా తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఇక నవంబర్ 7వ తేదీ నుంచి మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఇవాళ ఉదయం 08.30 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. రేపు కూడా తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఇక నవంబర్ 7వ తేదీ నుంచి మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}