దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే అనేక రైళ్లను సంక్రాంతి పండగ సందర్భంగా నడిపేందుకు సిద్ధమైంది. తాజాగా మరో 11 స్పెషల్ ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రా-తెలంగాణ మధ్య జనవరి 7వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ మధ్య ప్రయాణించేవారు.. బుకింగ్స్ చేసుకోవచ్చు, ప్రారంభమయ్యాయి.
07460 కాకినాడ -వికారాబాద్ ప్రత్యేక రైలు 08.01.2026న కాకినాడలో సాయంత్రం 06:20 కి బయలుదేరుతుందిఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
07461 వికారాబాద్ -పార్వతీపురం ట్రైన్ 09.01.2026,11.09.2026 తేదీల్లో వికారాబాద్ నుండి రాత్రి 08:30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 02:30కి పార్వతీపురం చేరుకుంటుంది.
07462 పార్వతీపురం-వికారాబాద్ స్పెషల్ ట్రైన్ 10.01.2026న సాయంత్రం 06:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30కి వికారాబాద్ చేరుకుంటుంది.
07463 పార్వతీపురం-కాకినాడ ప్రత్యేక రైలు 12.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు అంటే.. 13.01.2026 అర్ధరాత్రి ఒంటి గంటకు కాకినాడ చేరుకుంటుంది.
{{/usCountry}}07463 పార్వతీపురం-కాకినాడ ప్రత్యేక రైలు 12.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు అంటే.. 13.01.2026 అర్ధరాత్రి ఒంటి గంటకు కాకినాడ చేరుకుంటుంది.
{{/usCountry}}07464 సికింద్రాబాద్-పార్వతీపురం 08.1.2026న రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30కి పార్వతీపురం వస్తుంది.
07465 పార్వతీపురం-సికింద్రాబాద్ 09.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
07186 కాకినాడ-వికారాబాద్ ప్రత్యేక రైలు 07.01.2026,09.01.2026 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 4:45కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
07185 వికారాబాద్-కాకినాడ రైలు 08.01.2026న వికారాబాద్‌లో సాయంత్రం 05:35కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30కి కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
07187 వికారాబాద్-కాకినాడ రైలు 10.01.2026న సాయంత్రం 7 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.