ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి జులై 14, 2026 నాటి లేఖ ద్వారా అధికారిక ఆదేశాలను పంపింది.

01.07.2026 నాటికి అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల కోసం ఈ ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో మారిన తాజా సవరించిన షెడ్యూల్ వివరాలు చూడండి. నిజానికి జులై 14తో తేదీ ముగియాల్సి ఉంది. మరో 10 రోజులు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సవరించిన ముఖ్యమైన తేదీలు, కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
కొత్త షెడ్యూల్
బి.ఎల్.ఓ (BLO)ల ద్వారా ఇంటింటి సర్వే: ఈ గడువును 15.06.2026 నుండి 24.07.2026 వరకు సవరించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ / పునర్వ్యవస్థీకరణ: ఈ ప్రక్రియను 24.07.2026 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ (Draft Publication): 31.07.2026న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలు కాలపరిమితి: కొత్త ఓటర్ల నమోదు, మార్పులపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను సమర్పించడానికి 31.07.2026 నుండి 30.08.2026 వరకు సమయం కేటాయించారు.
నోటీసుల దశ / క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: సమర్పించిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను 31.07.2026 నుండి 28.09.2026 వరకు చేపడతారు.
తుది ఓటర్ల జాబితా ప్రచురణ : అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 03.10.2026న అధికారికంగా ప్రచురిస్తారు.
అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు
{{/usCountry}}తుది ఓటర్ల జాబితా ప్రచురణ : అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 03.10.2026న అధికారికంగా ప్రచురిస్తారు.
అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు
{{/usCountry}}ఈ సవరించిన నియామక షెడ్యూల్, పొడిగించిన గడువు సమాచారాన్ని సంబంధిత అధికారులు, సిబ్బంది అందరికీ తక్షణమే చేరవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల మీడియా మాధ్యమాల ద్వారా ఈ కొత్త తేదీలను విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం ఈ సవరించిన షెడ్యూల్ కాపీని లిఖితపూర్వకంగా అందజేయాలని ఈసీఐ తన లేఖలో పేర్కొంది.
నిజానికి ఎన్నికల సంఘం మెుదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జులై 14తో తేదీ ముగియాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కాలేదు. ఈ కారణంగా గడువును పొడిగిస్తూ.. ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. దీంతో 10 రోజులు గడువు పెంచుతూ అనుమతి వచ్చింది.