...
...
Next Story

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్ - స్పర్శ దర్శనాలు నిలిపివేత, ఎప్పటివరకంటే..?

శ్రీశైలం వచ్చే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. స్పర్శ దర్శనాలను డిసెంబర్ 8వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Published on: Dec 04, 2025 06:02 AM IST
Advertisement

శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు మరో ప్రకటన చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ కారణంగా రద్దీ ఎక్కువగా ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

శ్రీశైలం
శ్రీశైలం

సిఫార్సు లేఖలతో వచ్చే వారికి కూడా స్పర్శ దర్శనం ఉండదని స్పష్టం చేశారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1,500 సామూహిక అభిషేకాలు ఉంటాయని వివరించారు.

మరోవైపు శ్రీశైలంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ ద్వారా భారీ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే శివమాలధారులు కూడా భారీగా ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఫలితంగా స్పర్శ దర్శనానికి చాలా సమయం పడుతోంది. క్రమంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో… ఈనెల 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేయాలని అధికారులను నిర్ణయించారు.

మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో ఉండే భక్తులకు అల్పాహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

ఉచితంగా లడ్డూల పంపిణీ:

ఇక మల్లన్న స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe