...
...
Next Story

Tirumala : తిరుమల శ్రీవారి హుండీ బియ్యం ఈ-వేలం... ఇలా దక్కించుకోవచ్చు

TTD hundi rice e Auction : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ రైస్‌ను జూన్ 11న టీటీడీ ఈ-వేలం వేయనుంది. ఆసక్తి గల వారు జూన్ 10 లోపు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది.

Published on: Jun 08, 2026 12:44 PM IST
Advertisement

TTD hundi rice e Auction : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామివారి హుండీలో నగదు, బంగారంతో పాటు వివిధ రకాల వస్తువులను సమర్పిస్తుంటారు.

శ్రీవారి హుండీ బియ్యం ఈ-వేలం
శ్రీవారి హుండీ బియ్యం ఈ-వేలం

ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ఆలయాల హుండీల ద్వారా భక్తులు భారీగా బియ్యాన్ని కానుకగా సమర్పించారు. ఇలా సేకరించిన మిక్స్‌డ్ రైస్‌ను (మిశ్రమ బియ్యం) బహిరంగ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జూన్ 11వ తేదీన ఈ ఆన్‌లైన్ వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు.

20 లాట్లలో బియ్యం….

హుండీల ద్వారా లభించిన ఈ బియ్యాన్ని అధికారులు రకాల వారీగా వర్గీకరించి వేలానికి ఉంచారు. మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్స్‌డ్ రైస్‌ను పారదర్శక విధానంలో విక్రయించనున్నారు. వ్యాపారులు, ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ డిజిటల్ వేలంలో పాల్గొని బియ్యాన్ని దక్కించుకోవచ్చు.

  • ఈ-వేలంలో పాల్గొనాలని భావించే వేలంపాటదారులు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తుదారులు జూన్ 10వ తేదీ ఉదయం 10:00 గంటలలోపు ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా రూ. 50,000 ఈఎండీ (Earnest Money Deposit - EMD) చెల్లించాలి.
  • నిర్ణీత గడువులోగా ఈఎండీ సొమ్మును జమ చేసిన వారు మాత్రమే జూన్ 11న జరిగే ఆన్‌లైన్ వేలం పాటలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.

సంప్రదించాల్సిన నంబర్లు

సమాచారం కోసం 0877-2264429 ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు అడగవచ్చు. అలాగే భక్తులు, వ్యాపారుల సౌకర్యార్థం టీటీడీ అధికారిక వేలం వెబ్‌సైట్ www.konugolu.ap.gov.in ను కూడా నిరంతరం అందుబాటులో ఉంచారు. ఈ పోర్టల్‌ను సందర్శించి నిబంధనల పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe