మరో బిగ్ బాస్ ఫేమ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతని పేరు అమర్‌దీప్ చౌదరి. అతడు నటించిన మూవీ సుమతీ శతకం. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (జనవరి 29) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అమర్‌దీప్ మాట్లాడుతూ.. తాను హీరోగా ఎందుకు వస్తున్నానో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అనడం విశేషం.
అమర్‌దీప్ ఏమన్నాడంటే?

అమర్‌దీప్, శైలి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సుమతీ శతకం. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్లో అమర్‌దీప్ మాట్లాడాడు. “నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. నాది అనంతపురం. అక్కడి నుంచి చిన్నగా మొదలుపెట్టి అలా అలా పైకి ఎదిగాను. మీకు రామ్ గా పరిచయం అయ్యాను. ఆల్రెడీ ఇంత మంది హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు. నేను ఎందుకో ఈ సినిమాలో ఫుల్ సమాధానం ఉంది. ఇది కాదు లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇంచ్ బై ఇంచ్ నేను చాలా కష్టపడి పని చేశాను” అని అమర్‌దీప్ అన్నాడు.
సుమతీ శతకం మూవీ ట్రైలర్
సుమతీ శతకం మూవీ ట్రైలర్ ఫన్నీగా సాగిపోయింది. పెళ్లి కోసం పరితపించే యువకుడి పాత్రలో అమర్‌దీప్ నటించాడు. అతని పెళ్లికి, గుడిలో అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోవడానికి ఉన్న లింకేంటో ఈ సినిమాలో చూడొచ్చు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా రూపొందించిన సినిమా ఈ సుమతీ శతకం. ఎంఎం నాయుడు రచన, దర్శకత్వం వహించాడు.
సుమతీ శతకం మూవీలో బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ల గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మధ్యే మూవీ నుంచి సుమతి సుమతి అనే సాంగ్ రిలీజైంది. సుభాష్ ఆనందం మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.
{{/usCountry}}సుమతీ శతకం మూవీలో బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ల గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మధ్యే మూవీ నుంచి సుమతి సుమతి అనే సాంగ్ రిలీజైంది. సుభాష్ ఆనందం మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.
{{/usCountry}}