...
...
Next Story

Dhurandhar: 3 వేల కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2 సిరీస్- ఒక్క భాషలోనే వెయ్యి కోట్లు- బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీలను దాటేసి!

Dhurandhar Series Worldwide Box Office Collection: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్-2: ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. తాజాగా ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాంతో బాహుబలి, పుష్ప రికార్డ్స్ గల్లంతు అయ్యాయి.

Published on: Apr 14, 2026, 11:02:45 IST
Advertisement

Dhurandhar 2 Box Office Collection Day 26: బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సిరీస్ భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని ఘనత సాధించింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 3,019.35 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సిరీస్ కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు.

ఒక్క భాషలోనే 1,000 కోట్ల 'నెట్' వసూల్లు

3 వేల కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2 సిరీస్- ఒక్క భాషలోనే వెయ్యి కోట్లు- బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీలను దాటేసి! (X)
3 వేల కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2 సిరీస్- ఒక్క భాషలోనే వెయ్యి కోట్లు- బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీలను దాటేసి! (X)

గతంలో 'బాహుబలి' సిరీస్ (రూ. 2,438 కోట్లు), 'పుష్ప' సిరీస్ (రూ. 2,092 కోట్లు) పేరిట ఉన్న రికార్డులను ధురంధర్ ఫ్రాంచైజీ అధిగమించింది. ధురంధర్ సిరీస్‌లోని రెండు భాగాలు విడివిడిగా రూ. 1,000 కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేశాయి. ముఖ్యంగా 'ధురంధర్-2: ది రివేంజ్' హిందీ చిత్రసీమలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

భారతదేశంలో కేవలం ఒకే భాషలో (హిందీ) రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా ధురంధర్ 2 రికార్డు సృష్టించింది. పార్ట్-1 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307.35 కోట్లు వసూలు చేయగా, పార్ట్-2 ఏకంగా రూ. 1,718.62 కోట్లతో రికార్డులు తిరగరాసింది.

26వ రోజు కలెక్షన్ల వివరాలు

విడుదలై నాలుగు వారాలు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సినిమా జోరు తగ్గలేదు. అయితే వర్కింగ్ డే కావడంతో 26వ రోజున (నాలుగో సోమవారం-ఏప్రిల్ 13) వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. ఆదివారం (ఏప్రిల్ 12) నాడు రూ. 14.50 కోట్లు రాబట్టిన ధురంధర్ 2 సోమవారం రూ. 5.20 కోట్లకు పరిమితమైంది.

దేశవ్యాప్తంగా 10,286 షోలతో ప్రదర్శితమవుతున్న ధురంధర్ 2 చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో రూ. 1,088.62 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 1,303.37 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. విదేశాల్లోనూ ఈ సినిమా రూ. 415.25 కోట్లతో తన పట్టు నిలుపుకుంది.

ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రస్తుతం ఐపీఎల్ 2026 నడుస్తుండటంతో, టోర్నమెంట్ ముగిసిన తర్వాతే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. "ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ మైలురాయి" అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

CollectionDhurandharDhurandhar 2Total
India Net ₹ 840.20 crore ₹ 1088.62 crore ₹ 1928.82 crore
India Gross ₹ 1007.85 crore ₹ 1303.37 crore ₹ 2311.22 crore
Overseas ₹ 299.50 crore ₹ 415.25 crore ₹ 714.75 crore
Worldwide ₹ 1307.35 crore ₹ 1718.62 crore ₹ 3025.97 crore
LanguageEarnings on day 26Occupancy on day 26Shows on day 26
Hindi ₹5 crore12%9,893
Telugu ₹12 lakh16%245
Tamil ₹5 lakh27%89
Kannada ₹3 lakh18%59

కాగా రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం ఈ మూవీ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks