మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'దృశ్యం' (Drishyam) మూడో భాగం గురించి సినీ వర్గాల్లో ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Amazon) ఇప్పుడు రంగంలోకి దిగింది. 'దృశ్యం 3' డిజిటల్ హక్కులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఈ విషయంలో మూడో పక్షం ఎవరైనా జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ అధికారికంగా ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
అమెజాన్ నోటీసులో ఏముంది?

ఆశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas), అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. "దృశ్యం 3" (మలయాళం) మూవీకి సంబంధించి అన్ని రకాల డిజిటల్ హక్కులు (SVOD, TVOD, AVOD, FVOD, EST సహా) కేవలం అమెజాన్ వద్దే ఉన్నాయని ఈ నోటీసులో స్పష్టం చేశారు. ఈ హక్కులపై అమెజాన్‌కు మాత్రమే పూర్తి, ప్రత్యేకమైన అధికారం ఉందని సంస్థ పేర్కొంది.
ప్రజలకు, ప్లాట్‌ఫామ్‌లకు హెచ్చరిక
ఈ హక్కులను విక్రయించడానికి, లైసెన్స్ ఇవ్వడానికి లేదా ఈ సినిమా డిజిటల్ హక్కులపై ఎలాంటి థర్డ్ పార్టీ ప్రయోజనాలను సృష్టించడానికి ఆశీర్వాద్ సినిమాస్‌కు గానీ, వారి ప్రతినిధులకు గానీ ఎలాంటి అధికారం లేదని అమెజాన్ హెచ్చరించింది.
ఒకవేళ అమెజాన్ హక్కులను ఉల్లంఘిస్తూ ఎవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈ సినిమా విషయంలో లావాదేవీలు జరిపితే, వారు తమ సొంత రిస్క్, ఖర్చుతోనే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తమ హక్కులకు విఘాతం కలిగించినా లేదా ఒప్పంద సంబంధాల్లో జోక్యం చేసుకున్నా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.
ఈ నోటీసుతో 'దృశ్యం 3' డిజిటల్ హక్కులపై ఉన్న సందిగ్ధతకు తెరపడటమే కాకుండా, సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వెల్లడయ్యింది. దృశ్యం 3 మూవీ మే 21న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
దృశ్యం సిరీస్ రికార్డులు..
{{/usCountry}}ఈ నోటీసుతో 'దృశ్యం 3' డిజిటల్ హక్కులపై ఉన్న సందిగ్ధతకు తెరపడటమే కాకుండా, సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వెల్లడయ్యింది. దృశ్యం 3 మూవీ మే 21న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
దృశ్యం సిరీస్ రికార్డులు..
{{/usCountry}}మలయాళ సినిమా చరిత్రలోనే దృశ్యం సిరీస్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ దృశ్యం సినిమాలో జార్జ్‌కుట్టి అనే ఒక సామాన్యుడు, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని దర్శకుడు జీతు జోసెఫ్ చాలా అద్భుతంగా చూపించాడు.
వాళ్లను పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంటే, అతడు వాళ్ల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడు అనేది జనాలకు భలే కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఎవరూ ఊహించని ట్విస్టులు, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే గ్రిప్పింగ్ స్టోరీతో ఆ సెకండ్ పార్ట్ ఆడియన్స్‌కు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. మోహన్ లాల్, మీనా తిరిగి తమ పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.