Jani Master: టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో వివాదం తీవ్రస్థాయిలో రాజుకుంది. సీనియర్ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ సంచలన ఆరోపణలు చేస్తూ జాని మాస్టర్‌పై విరుచుకుపడ్డారు. లోకల్ డ్యాన్సర్ల పొట్ట కొడుతూ, కమీషన్ల కోసం ముంబై నుంచి ఆర్టిస్టులను తెప్పిస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద కలకలం రేపాయి.
దినేష్ మాస్టర్ సంచలన ఆరోపణలు

మీడియా ముందుకు వచ్చిన దినేష్ మాస్టర్.. జాని మాస్టర్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ తెలుగు డ్యాన్సర్లకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని, పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని అసోసియేషన్ సభ్యులను పక్కనపెట్టి, తన స్వార్థం కోసం ముంబై నుంచి డ్యాన్సర్లను రప్పిస్తున్నారని దినేష్ ఆరోపించారు. అక్కడ నుంచి వచ్చే ప్రతి డ్యాన్సర్ నుంచి భారీగా కమీషన్లు దండుకుంటున్నారనేది ఆయన చేసిన ప్రధాన ఆరోపణ.
స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లకు తప్పుడు సమాచారం
పెద్ద సినిమాల షూటింగ్స్ సమయంలో లోకల్ డ్యాన్సర్లు అందుబాటులో లేరని జాని మాస్టర్ డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు అబద్ధాలు చెప్తున్నారని దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వందలాది మంది స్థానిక తెలుగు యూనియన్ డ్యాన్సర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
స్టార్ హీరోల డ్యాన్స్ నంబర్ల విషయంలో మేకర్స్‌ను తప్పుదోవ పట్టిస్తూ, యూనియన్ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఫెడరేషన్ విచారణకు జాని మాస్టర్ డుమ్మా
మరోవైపు ఈ నెల 12వ తేదీన జాని మాస్టర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఫిలిం ఫెడరేషన్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని యూనియన్ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వివాదంపై వివరణ కోరేందుకు ఈ నెల 14న జరిగిన విచారణకు రావాలని ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు.
సమన్లు పంపినా విచారణకు రాకపోవడంతో ఫెడరేషన్ నిర్వాహకులు జాని మాస్టర్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే షోకాజ్ నోటీసులు పంపారు.
7 రోజుల గడువు.. క్షమాపణ చెప్పాల్సిందే!
{{/usCountry}}సమన్లు పంపినా విచారణకు రాకపోవడంతో ఫెడరేషన్ నిర్వాహకులు జాని మాస్టర్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే షోకాజ్ నోటీసులు పంపారు.
7 రోజుల గడువు.. క్షమాపణ చెప్పాల్సిందే!
{{/usCountry}}ఈ వ్యవహారంలో జాని మాస్టర్‌కు ఏడు రోజుల సమయం ఇస్తూ ఫెడరేషన్ నోటీసులు పంపింది. ఈ గడువులోగా తగిన ఆధారాలతో లేదా సరైన కారణాలతో రాతపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఫెడరేషన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే టాలీవుడ్‌లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్, సుమలత తీరుపై తీవ్ర ఆగ్రహం
డ్యాన్సర్స్ అసోసియేషన్ నడుచుకుంటున్న తీరుపై కూడా ఫిలిం ఫెడరేషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అసోసియేషన్‌లో జరుగుతున్న కొన్ని అక్రమాలు, స్థానిక డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయంపై ఇతర సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడరేషన్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే క్రమంలో సుమలత ప్రవర్తనపై కూడా ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగ్గా లేదని, ఫెడరేషన్ కంట్రోల్ దాటి ప్రవర్తించడం తగదని స్పష్టం చేసింది.
వరుస వివాదాల్లో జాని మాస్టర్
గత కొంతకాలంగా జాని మాస్టర్ వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు వల్ల తీవ్రమైన వివాదంలో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
ఆ వివాదం కారణంగా ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా ఓపెన్ అయిన ఈ డ్యాన్స్ యూనియన్ వివాదం ఆయన కెరీర్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.
లోకల్ డ్యాన్సర్ల భవిష్యత్తుపై ఆందోళన
టాలీవుడ్‌లో వందల కుటుంబాలు కేవలం ఈ డ్యాన్స్ యూనియన్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. బయటి రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడం వల్ల స్థానిక కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తున్నారని దినేష్ మాస్టర్ చెప్పారు.
ఈ విషయంలో ఫిలిం ఫెడరేషన్ కఠినమైన నిర్ణయాలు తీసుకుని స్థానిక తెలుగు డ్యాన్సర్ల ఉపాధిని కాపాడాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.