డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడిన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా గళమెత్తాడు. దీనిని కట్టడి చేయడానికి కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నాడు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీలో చిరు పాల్గొన్నాడు. అతడు ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటం విశేషం.
డీప్ ఫేక్‌పై చిరంజీవి యుద్ధం

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఏక్తా దివస్ 2కే రన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని దుర్వినియోగం చేస్తుండటంపై చిరు మాట్లాడాడు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను కొనియాడాడు. అయితే డీప్ ఫేక్ ఓ గొడ్డలి పెట్టులాంటిదని, దీనికి చెక్ పెట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశాడు.
టెక్నాలజీ మన జీవితాలను హాయిగా మార్చేసినా ఆ మంచితోపాటు చెడు కూడా ఉంటుందని అన్నాడు. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కోరాడు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడాలని, వినోదం కోసం, ఆకర్షించడం కోసం ఎవరికీ హాని తలపెట్టొద్దని అన్నాడు. తాను కూడా దీని బాధితుడినే అని, తన ఫొటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్ వీడియోలను క్రియేట్ చేయడంపై చిరంజీవి ఈ మధ్యే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అతని ఫొటోలు, వాయిస్ వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు కూడా చెప్పింది.
చిరంజీవి ఈ మధ్యే అయ్యప్ప మాల వేసుకున్నాడు. నల్లటి దుస్తుల్లోనే అతడు ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ప్రతి ఏటా రామ్ చరణ్ మాల వేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ చిరంజీవి కూడా అయ్యప్ప మాలలో కనిపించడం విశేషం.
చిరంజీవి రాబోయే సినిమాలు
ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు విశ్వంభరతోపాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాద్ గారు మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన మీసాల పిల్ల సాంగ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
{{/usCountry}}ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు విశ్వంభరతోపాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాద్ గారు మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన మీసాల పిల్ల సాంగ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
{{/usCountry}}