...
...
Next Story

Netflix: నేరుగా ఓటీటీలోకి ఓజీ హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ డ్రామా.. కొరియా వెళ్లే తమిళ అమ్మాయి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

పవన్ కల్యాణ్ ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా' (Made in Korea) నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

Published on: Mar 4, 2026, 19:08:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'డాక్టర్', 'డాన్', ఓజీ వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక అరుల్ మోహన్.. ఇప్పుడు ఒక వైవిధ్యమైన కథాంశంతో మన ముందుకు వస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. రా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మేడ్ ఇన్ కొరియా ట్రైలర్ ఎలా ఉందంటే?

Netflix: నేరుగా ఓటీటీలోకి ఓజీ హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ డ్రామా.. కొరియా వెళ్లే తమిళ అమ్మాయి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Netflix: నేరుగా ఓటీటీలోకి ఓజీ హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ డ్రామా.. కొరియా వెళ్లే తమిళ అమ్మాయి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ సినిమా మార్చి 12న అడుగుపెడుతోంది. బుధవారం (మార్చి 4) మేడ్ ఇన్ కొరియా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. కన్యాకుమారికి చెందిన శెంబ (ప్రియాంకా మోహన్) అనే ఒక అమ్మాయికి సౌత్ కొరియా వెళ్లాలనేది పెద్ద కల. చిన్నప్పటి నుండి అక్కడి భాష, సంస్కృతిని నేర్చుకుంటూ ఎలాగైనా సియోల్ (Seoul) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది.

చివరికి తన కల నిజమై కొరియాలో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ. ఫాంటసీగా మొదలైన ఆమె ప్రయాణం.. అక్కడి కొత్త మనుషులు, భిన్నమైన సంస్కృతి, కొన్ని చిక్కుల మధ్య ఎలా సాగిందనేది ట్రైలర్‌లో చూపించారు. చివరికి కొరియా తన సొంత గుర్తింపును తనకు చూపిందని ఆమె చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.

మేడ్ ఇన్ కొరియా కథా నేపథ్యం

ఇది ఒక కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. తన కలల దేశంలో అడుగుపెట్టిన శెంబ, అక్కడ ఊహించిన దానికి భిన్నంగా ఉండే వాస్తవ పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? ఒంటరిగా ఉంటూ తనలోని బలాన్ని ఎలా గుర్తించింది? అనే భావోద్వేగభరితమైన అంశాలను ఈ సినిమాలో చర్చించారు. సౌత్ కొరియన్ నటులు పార్క్ హే-జిన్, నో హో-జిన్ కీలక పాత్రల్లో నటించారు. స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ ద్వారా పార్క్ ఇండియన్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

మేడ్ ఇన్ కొరియా ఓటీటీ రిలీజ్ వివరాలు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks