...
...
Next Story

Web Series: చచ్చిన తర్వాత కాదు.. చావకముందే ఆ నలుగురిని తీసుకురండి.. ప్రైమ్ వీడియో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

Web Series: ప్రేక్షకులను అలరించే కంటెంట్‌ను అందించే 'టీవీఎఫ్' (The Viral Fever) నుంచి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ రాబోతోంది. రణవీర్ షోరే, శేఖర్ సుమన్ తదితరులు నటించిన 'ది పిరమిడ్ స్కీమ్' జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Published on: May 29, 2026 03:19 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Web Series: విభిన్నమైన కథాంశాలతో, సామాన్యుల జీవితాలకు అద్దం పట్టే సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించే టీవీఎఫ్ (The Viral Fever) సంస్థ, ఇప్పుడు మరో కొత్త వెబ్ సిరీస్‌తో మన ముందుకు రాబోతోంది. 'ది పిరమిడ్ స్కీమ్' (The Pyramid Scheme) పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త థ్రిల్లర్ సిరీస్ జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది.

ది పిరమిడ్ స్కీమ్ ట్రైలర్ రిలీజ్

Web Series: చచ్చిన తర్వాత కాదు.. చావకముందే ఆ నలుగురిని తీసుకురండి.. ప్రైమ్ వీడియో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
Web Series: చచ్చిన తర్వాత కాదు.. చావకముందే ఆ నలుగురిని తీసుకురండి.. ప్రైమ్ వీడియో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

"విజయానికి షార్ట్‌కట్ లేదా వినాశనానికి దారా?" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో మేకర్స్ ఈ సిరీస్ ప్రకటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే.. ఈ వెబ్ సిరీస్ త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ, మోసపూరిత పెట్టుబడి ప్లాన్ల చుట్టూ తిరిగే క్రైమ్ అండ్ డ్రామా నేపథ్యంతో సాగుతుందని అర్థమవుతోంది. 'పిరమిడ్ స్కీమ్' అనే పేరులోనే నెట్‌వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల ఛాయలు కనిపిస్తున్నాయి.

మీరు చేరండి.. మరో నలుగురిని చేర్చండి.. ఆ నలుగురు మరో నలుగురిని చేరుస్తారు.. చచ్చిన తర్వాత కాదు.. చావక ముందే ఆ నలుగురిని వెతుక్కుంటే చాలు అనే ఈ ట్రైలర్ లో వచ్చే డైలాగ్ చూస్తే.. సిరీస్ ఎలా సాగనుందో స్పష్టమవుతుంది.

పిరమిడ్ స్కీమ్ వల ఎలా ఉంటుంది?

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), చైన్ సిస్టమ్ పేరుతో జనాలను బురిడీ కొట్టించే మోసాలనే ఆర్థిక పరిభాషలో పిరమిడ్ స్కీమ్స్ అంటారు. ముందుగా చేరిన వారు తమ కింద మరికొంతమందిని చేర్పించడం, వారి ద్వారా పెట్టుబడులు పెట్టించడం ద్వారా భారీ కమీషన్లు వస్తాయని ఆశచూపుతారు.

ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ సీనియర్ నటులు రణవీర్ షోరే, శేఖర్ సుమన్, అఖిలేంద్ర మిశ్రా, ఆంజన్ శ్రీవాస్తవ్, సుశాంత్ సింగ్, ఇంద్రేష్ మాలిక్, స్మితా బన్సాల్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే పరమ్‌వీర్ చీమా, అల్ఫియా జాఫ్రీ, ఆశిష్ కుమార్ రాఘవ తదితరులు కూడా ఇందులో నటిస్తున్నారు.

టీవీఎఫ్ ఫౌండర్ అరుణాభ్ కుమార్, విజయ్ కోశి నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఆశిష్ ఆర్ శుక్లా, అక్షేంద్ర మిశ్రా కీలక బాధ్యతలు వహిస్తున్నారు. గుల్లక్, పంచాయత్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌ల తర్వాత టీవీఎఫ్ నుంచి వస్తున్న ఈ కొత్త సిరీస్‌పై డిజిటల్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఫైనాన్షియల్ క్రైమ్స్, స్కామ్‌ల నేపథ్యంలో వచ్చే కథలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు ఉత్కంఠకు గురిచేస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'ది పిరమిడ్ స్కీమ్' వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతోంది?

'ది పిరమిడ్ స్కీమ్' వెబ్ సిరీస్ జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది.

ది పిరమిడ్ స్కీమ్ సిరీస్‌ను నిర్మిస్తున్న సంస్థ ఏది?

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎన్నో సూపర్ హిట్ సిరీస్‌లు అందించిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'టీవీఎఫ్' (The Viral Fever) ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.

ది పిరమిడ్ స్కీమ్ సిరీస్‌లో నటిస్తున్న ప్రధాన నటీనటులు ఎవరు?

రణవీర్ షోరే, శేఖర్ సుమన్, అఖిలేంద్ర మిశ్రా, సుశాంత్ సింగ్, స్మితా బన్సాల్ తదితర ప్రముఖ సీనియర్ నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe