...
...
Next Story

Salman Khan: నాకు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు.. ఆ కోట్ల విలువైన వాచీలు నావి కావు: సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Salman Khan: సుమారు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలుతున్న సల్మాన్ ఖాన్ ఓ షాకింగ్ విషయం చెప్పాడు. ఇప్పటి వరకూ తన కెరీర్లో ఒక్క సినిమా స్క్రిప్ట్ కూడా చదవలేదని చెప్పడం గమనార్హం.

Published on: May 16, 2026 10:00 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన మూడు దశాబ్దాలకుపైగా సినీ ప్రయాణంపై ఒక సంచలన నిజం బయటపెట్టారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ సూపర్ స్టార్.. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తిగా చదవలేదనే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 'వెరైటీ ఇండియా' (Variety India) కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"స్క్రిప్ట్‌లు నేను రాస్తాను.. కానీ చదవను"

Salman Khan: నాకు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు.. ఆ కోట్ల విలువైన వాచీలు నావి కావు: సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ (PTI)
Salman Khan: నాకు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు.. ఆ కోట్ల విలువైన వాచీలు నావి కావు: సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ (PTI)

సినిమాల ఎంపిక, కథల సెలెక్షన్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తాను స్క్రిప్ట్‌లను లైన్ బై లైన్ చదవడానికి అస్సలు ఇష్టపడనని చెప్పారు.

"నేను నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు. నేను కొన్ని కథలు రాశాను.. కానీ వేరే వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్‌లను మాత్రం ఎప్పుడూ చదవలేదు" అని సల్మాన్ స్పష్టం చేశారు.

సినిమాను ఎంచుకునేటప్పుడు కథలోని ఓవరాల్ ఫీల్, ఎమోషనల్ కనెక్ట్, కమర్షియల్ వాల్యూస్ మాత్రమే చూస్తానని ఆయన అన్నారు. కథ మొత్తం విన్నప్పుడు వచ్చే తన సొంత ఆలోచనపైనే ఆధారపడతానని చెప్పారు. 30 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందించిన ఒక స్టార్ హీరో ఇలా అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఆ కోట్ల విలువైన వాచీలు నావి కావు

పబ్లిక్ ఈవెంట్లలో సల్మాన్ ఖాన్ ధరించే లగ్జరీ వాచీలపై కూడా ఈ ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన రూ.1 కోటికి పైగా విలువైన వాచీలతో కనిపిస్తుంటారు. అయితే వాటిపై సల్మాన్ నవ్వుతూ స్పందించారు.

"స్క్రీన్ మీద లేదా బయట నన్ను రకరకాల ఖరీదైన వాచీలతో చూస్తుంటారు కదా.. అవన్నీ నావి అని అనుకోవద్దు. అందులో చాలావరకు నా స్నేహితులవి. కొందరు ఫ్రెండ్స్ సరదాగా ఇస్తే పెట్టుకుంటాను అంతే" అని చెప్పడం విశేషం.

'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' కాస్తా 'మాతృభూమి'గా..

అయితే రక్షణ మంత్రిత్వ శాఖ సూచనలు, కొన్ని మార్పుల వల్ల చైనా లేదా గల్వాన్ వ్యాలీ ప్రస్తావనలు లేకుండా సినిమాను పూర్తిగా రీవర్క్ చేస్తున్నారు. యుద్ధాన్ని గ్లోరిఫై చేయకుండా, ఎమోషనల్ పేట్రియాటిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇదే కాకుండా సల్మాన్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితోనూ మరో మూవీ చేస్తున్నారు. ఇందులో నయనతార ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సల్మాన్ ఖాన్ స్క్రిప్ట్ చదవకుండా సినిమాలు ఎలా ఒప్పుకుంటారు?

ఆయన కథ మొత్తం సారాంశం, దర్శకుడి టేకింగ్ విధానం, కమర్షియల్ అంశాలను బట్టి తన ఇన్స్టింక్ట్‌తో సినిమాలను ఓకే చేస్తారు.

2. 'మాతృభూమి' సినిమా టైటిల్ ఎందుకు మార్చారు?

మొదట 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అని అనుకున్నప్పటికీ, కథను కేవలం ఒక యుద్ధానికే పరిమితం చేయకుండా, భావోద్వేగ దేశభక్తిని ప్రతిబింబించేలా చేయడానికి 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' అని మార్చారు.

3. వంశీ పైడిపల్లి సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నయనతార కాంబినేషన్‌లో సల్మాన్ చేయబోయే సినిమాను ఈద్ 2027 కు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe