Rajeev Kanakala: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక వివాదానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల వైబ్రెంట్ స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి తాను హాజరవడంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు రాజీవ్ కనకాల స్వయంగా రంగంలోకి దిగారు.
అసలేం జరిగింది?

వైబ్రెంట్ స్కూల్‌లో జరిగిన ఒక ఈవెంట్ కు రాజీవ్ కనకాల హాజరయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ స్కూలు ఈవెంట్ కు రావడం ఏంటని నవ తెలంగాణ శక్తి అధ్యక్షుడు పవన్ ఆయనను నిలదీశారు. దీనిపై తాజాగా ఓ వీడియో ద్వారా రాజీవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
"వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందనే దానిపై కొన్ని అపోహలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాలని కోరుతున్నాను," అని ఆయన పేర్కొన్నారు.
స్పష్టతనిస్తూ సోషల్ మీడియా పోస్ట్
ఈ వివరణాత్మక వీడియోతో పాటు ఆయన ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేశారు. "వైబ్రెంట్ స్కూల్‌లో జరిగిన తాజా సంఘటనకు సంబంధించి ఈ చిన్న వివరణ ఇస్తున్నాను. తల్లిదండ్రులందరికీ ఇది నా ముఖ్య గమనిక. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. విద్యార్థుల సేఫ్టీ, ట్రాన్స్‌పరెన్సీ మా మొదటి ప్రాధాన్యత," అని రాసుకొచ్చారు.
రాజీవ్ కనకాల ఇలా నేరుగా స్పందించడంతో మెజారిటీ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడాన్ని నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.
“ఆ స్కూల్‌లో పాసైన విద్యార్థులకు సన్మాన, సత్కారాల కోసమే నేను వెళ్లాను. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విషయం నాకు నిజంగానే తెలియదు. అది తెలిసిన తర్వాత నాకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ వాడొద్దని ఆ స్కూల్ వాళ్లకు స్పష్టం చేశాను. అలాగే ఆ స్కూల్‌లో పిల్లలను చేర్చే పేరెంట్స్ అందరూ పూర్తిగా విచారించిన తర్వాతే ఆ పని చేయాలి” అంటూ ఆ వీడియోలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}“ఆ స్కూల్‌లో పాసైన విద్యార్థులకు సన్మాన, సత్కారాల కోసమే నేను వెళ్లాను. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విషయం నాకు నిజంగానే తెలియదు. అది తెలిసిన తర్వాత నాకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ వాడొద్దని ఆ స్కూల్ వాళ్లకు స్పష్టం చేశాను. అలాగే ఆ స్కూల్‌లో పిల్లలను చేర్చే పేరెంట్స్ అందరూ పూర్తిగా విచారించిన తర్వాతే ఆ పని చేయాలి” అంటూ ఆ వీడియోలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}రాజీవ్ కనకాల ఏ స్కూల్ వివాదంపై స్పందించారు?
హైదరాబాద్‌లోని వైబ్రెంట్ స్కూల్ (Ybrant School) లో జరిగిన ఒక కార్యక్రమం, దానికి సంబంధించి చెలరేగిన వివాదంపై స్పందించారు.
ఈ వివాదంపై రాజీవ్ ఎందుకు వివరణ ఇచ్చారు?
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ కు హాజరవడంపై రాజీవ్ కనకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు సోషల్ మీడియా ద్వారా వీడియోలో వివరణ ఇచ్చాడు.