...
...
Next Story

Fridge Smell : ఫ్రిజ్ తెరిస్తే ఒకరకమైన వాసన వస్తోందా..? సింపుల్ చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి

భారతీయ వంటకాల్లో మసాలాలు, ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువ. వీటిని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వచ్చే ఘాటైన వాసనలను పోగొట్టడానికి 'టీ బ్యాగులు' చక్కని పరిష్కారం.

Published on: May 09, 2026 01:42 PM IST
Advertisement

Fridge odor removal hack : మన భారతీయ ఆహారంలో సుగంధ ద్రవ్యాలు, మసాలాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మిగిలిపోయిన కూరలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా కూరల వాసన ఫ్రిజ్ అంతటా వ్యాపించి…. ఫ్రిజ్ డోర్ తీయగానే ఒకరకమైన వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ, మీ వంటింట్లో దొరికే ఒక వస్తువుతో ఈ సమస్యకు అతి తక్కువ ఖర్చుతో స్వస్తి చెప్పవచ్చు. అదే ‘యూజ్డ్ టీ బ్యాగ్స్’….!

టీ బ్యాగ్ ఎలా పనిచేస్తుంది?

Kitchen hack
Kitchen hack

మనం టీ తయారు చేసుకున్న తర్వాత టీ బ్యాగులను పడేస్తుంటాం. కానీ, వీటిలో ఉండే టీ ఆకులకు వాసనలను పీల్చుకునే గుణం ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉండే ఆహార పదార్థాల నుంచి వెలువడే బలమైన సువాసనలను లేదా దుర్వాసనలను ఈ టీ ఆకులు గ్రహించి… లోపల వాతావరణాన్ని తాజాగా మారుస్తాయి.

ఈ హ్యాక్‌ను ఎలా ఉపయోగించాలి?

  • స్టెప్ 1: టీ తయారు చేసిన తర్వాత ఉపయోగించిన టీ బ్యాగ్‌ను పక్కన పెట్టుకోండి.
  • స్టెప్ 2: దానిలో నీరు ఎక్కువగా ఉండకుండా కాసేపు ఆరనివ్వండి (మరీ తడిగా ఉంటే ఫ్రిజ్‌లో చిందరవందరగా ఉంటుంది).
  • స్టెప్ 3: ఒక చిన్న ప్లేట్ లేదా గిన్నెలో ఆ టీ బ్యాగ్‌ను ఉంచి, ఫ్రిజ్ ఒక మూలన పెట్టండి.
  • స్టెప్ 4: ప్రతి 1-2 రోజులకు ఒకసారి పాత టీ బ్యాగ్‌ను తీసేసి కొత్తది పెట్టండి.

ఈ చిట్కా వల్ల ప్రయోజనాలు

  • పడేసే వస్తువుతోనే పని పూర్తవుతుంది.
  • ఆర్టిఫిషియల్ రూమ్ ఫ్రెషనర్లు లేదా కెమికల్స్ వాడాల్సిన పనిలేదు.
  • సులభమైన మార్గం… అదనపు శ్రమ ఏమీ ఉండదు.

కేవలం టీ బ్యాగులే కాకుండా, ఫ్రిజ్ తాజాగా ఉండాలంటే మరికొన్నింటిని కూడా పాటించాలి. ఆహారాన్ని ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాల్లోనే ఉంచాలి. పాడైపోయిన లేదా గడువు ముగిసిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా ఉంచినా వాసనలు తగ్గుతాయి. సగం కోసిన నిమ్మకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మంచి సువాసన వస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON