...
...
Next Story

ఇంజనీరింగ్, డిగ్రీ వారికి సువర్ణావకాశం! ఎలాంటి పరీక్షలు లేకుండా హెచ్‌ఏఎల్​లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్..

ఇంజనీరింగ్, డిగ్రీ చేసిన వారికి సువర్ణావకాశం! ఎలాంటి రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే హెచ్‌ఏఎల్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 జరుగుతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 25, 2025 05:50 AM IST
Advertisement

ఏవియానిక్స్ విభాగం, అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్​). ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటు టెక్నికల్, నాన్-టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులు. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం 2025-26 విద్యా సంవత్సరం కోసం ఈ నియామకాలు జరుగుతున్నాయి.

హెచ్‌ఏఎల్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025
హెచ్‌ఏఎల్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025

హెచ్​ఏఐ అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2025లో ఎంపికైన అభ్యర్థులకు ఉత్తరప్రదేశ్‌లోని కోర్వా కేంద్రంలో స్టైఫండ్‌తో కూడిన అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 31, 2025 లోపు హెచ్​ఏఎల్​ అధికారిక వెబ్‌సైట్ hal-india.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

హెచ్‌ఏఎల్ అప్రెంటిస్‌షిప్‌కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి తమ విద్యను పూర్తి చేసి ఉండాలి.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:

నాలుగు సంవత్సరాల బీఈ/బీటెక్​ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. కింది విభాగాల్లో (లేదా వాటికి సంబంధించిన బ్రాంచ్‌లలో) డిగ్రీ చేసి ఉండాలి:

  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:

మూడు సంవత్సరాల డిగ్రీని కింది విభాగాలలో పూర్తి చేసి ఉండాలి:

  • బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ)
  • బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్​)
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్)
  • బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ - ఇంగ్లీష్ (బీఏ ఇంగ్లీష్​)

టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్‌లు:

గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగాలు:

  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • అలాగే, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

హెచ్​ఏఎల్​ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు చేసే విధానం..

ముందుగా mhrdnats.gov.in అనే NATS పోర్టల్‌లో మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.

halindia.co.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'Careers' (కెరీర్స్) విభాగంలోకి వెళ్లి, అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడాలి.

నోటిఫికేషన్‌లో ఇచ్చిన గూగుల్ ఫారం లింక్‌పై క్లిక్ చేసి, మీ డిప్లొమా మార్కులు, వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు వివరాలు వంటి సమాచారాన్ని నింపండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే ముందు నింపిన వివరాలన్నీ సరిచూసుకోండి. భవిష్యత్తులో డాక్యుమెంట్ల పరిశీలన కోసం సమర్పించిన ఫారం ప్రింటౌట్ తప్పనిసరిగా తీసుకోవాలి.

హెచ్​ఏఎల్​ అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2025- అభ్యర్థుల ఎంపిక విధానం..

ఈ పోస్టుల ఎంపిక కేవలం అభ్యర్థులు క్వాలిఫైయింగ్ పరీక్ష (ఇంజనీరింగ్/జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్/టెక్నికల్ డిప్లొమా/MOM&SP డిప్లొమా)లో సాధించిన మార్కులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నియామకాలకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ వంటివి ఉండవు.

హెచ్​ఏఎల్ అప్రెంటిస్​​ రిక్రూట్​మెంట్​ 2025- ముఖ్య తేదీలు..

అర్హత సాధించిన వారి జాబితా: ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను నవంబర్ 20 నుంచి నవంబర్ 22, 2025 మధ్య అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

డాక్యుమెంట్​ వెరిఫికేషన్​: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ల పరిశీలన నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3, 2025 వరకు హెచ్​ఏఎల్​ కోర్వా కేంద్రంలో జరుగుతుంది.

తప్పనిసరిగా తీసుకురావాల్సినవి: ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, వర్తించినట్లయితే కులం లేదా వైకల్య పత్రాలను తీసుకురావాలి.

ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. వారికి BOAT కాన్పూర్ నిబంధనల ప్రకారం స్టైఫండ్‌ను చెల్లిస్తారు.

హెచ్‌ఏఎల్ గురించి..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్​) అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఒక ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థ. ఇది విమానాలు, హెలికాప్టర్లు, ఇంజిన్లను రూపకల్పన చేయడం, తయారు చేయడం, వాటిని ఆధునికీకరించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe