...
...
Next Story

JEE Mains 2026 : జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 రిజిస్ట్రేషన్​పై బిగ్​ అప్డేట్​..

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్ 2 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఎన్టీఏ ప్రారంభించింది. మరోవైపు సెషన్ 1కు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేస్తూ, అభ్యంతరాల స్వీకరణ, ఫలితాల తేదీని కూడా ప్రకటించింది.

Published on: Feb 01, 2026 06:45 AM IST
Advertisement

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్ 2 రిజిస్ట్రేషన్​పై కీలక అప్డేట్​ ఇచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఎక్స్​లో పోస్ట్​ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్ 2 రిజిస్ట్రేషన్​ విండో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 25, 2026 వరకు తెరిచి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత కాలపరిమితిలోగా తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, దరఖాస్తు ఫారమ్‌ను నింపి, పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్స్​ 2026 అప్డేట్స్​..
జేఈఈ మెయిన్స్​ 2026 అప్డేట్స్​..

అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ప్రక్రియకు సంబంధించిన తదుపరి అప్‌డేట్లు, సూచనల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా పోర్టల్‌ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.

అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సహాయం కావాలంటే jeemain@nta.ac.in ఈమెయిల్ ద్వారా లేదా 011-40759000 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఏజెన్సీని సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 లేటెస్ట్​ అప్‌డేట్స్..

మరోవైపు జేఈఈ మెయిన్స్​ సెషన్ 1కు సంబంధించి కూడా ఎన్టీఏ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థుల ప్రాథమిక ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసినట్లు సమాచారం అందించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. అభ్యర్థులు ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 5, 2026 మధ్య అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు.

ఈ ఆన్సర్ కీ ఛాలెంజ్ విండో ద్వారా అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక జేఈఈ మెయిన్స్​ వెబ్‌సైట్ ద్వారా వాటిని సమర్పించవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చిన అన్ని సవాళ్లను సమీక్షించిన తర్వాత, ఫిబ్రవరి 12, 2026 నాటికి జేఈఈ మెయిన్స్​ సెషన్ 1 తుది ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.

జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 21 నుంచి 25 వరకు, ఆపై జనవరి 28, 29 తేదీల్లో జరిగాయి. ఎటువంటి ఆటంకాలు లేని ధృవీకరణ ప్రక్రియను నిర్ధారించడానికి, పటిష్టమైన భద్రతా చర్యల మధ్య అభ్యర్థులకు ఫేస్ ఆథెంటికేషన్, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను నిర్వహించినట్లు ఎన్టీఏ తెలిపింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe