గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ ఆర్థిక వెసులుబాటు కల్పించే కొత్త వేతన ఒప్పందాన్ని కంపెనీ సిద్ధం చేసింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాబోయే మూడేళ్లలో పిచాయ్ దాదాపు 692 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.
ఈ భారీ ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?

సుందర్ పిచాయ్ శాలరీ స్ట్రక్చర్ పరిశీలిస్తే, అందులో నగదు రూపంలో వచ్చే జీతం కంటే షేర్ల వాటానే ఎక్కువగా ఉంది.
- స్థిర వేతనం (Base Salary): పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లు (సుమారు ₹17 కోట్లు). మూడేళ్ల కాలానికి ఇది 6 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు.
- ఆల్ఫాబెట్ స్టాక్స్: ప్యాకేజీలో ప్రధాన భాగం ఆల్ఫాబెట్ కంపెనీ షేర్ల రూపంలో ఉంటుంది. ఇవి కంపెనీ పనితీరు, డివిడెండ్ల ఆధారంగా లభిస్తాయి.
- అనుబంధ సంస్థల వాటా: ఈసారి ప్యాకేజీలో గూగుల్ కొత్త ప్రయోగం చేసింది. పిచాయ్‌కు గూగుల్ అనుబంధ సంస్థలైన వేమో (Waymo) - అటానమస్ వెహికల్ కంపెనీ, వింగ్ (Wing) - డ్రోన్ డెలివరీ సర్వీస్ సంస్థల షేర్లను కూడా కేటాయించింది.
వేమో నుంచి 130 మిలియన్ డాలర్లు, వింగ్ నుంచి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఆయనకు దక్కే అవకాశం ఉంది.
షరతులు వర్తిస్తాయి
ఈ 692 మిలియన్ డాలర్ల మొత్తం పిచాయ్‌కు నేరుగా చేతికి రాదు. ఇది పూర్తిగా సదరు కంపెనీల షేర్ల విలువ, మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత లక్ష్యాలను చేరుకోలేకపోతే ఈ మొత్తం తగ్గే అవకాశం కూడా ఉంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ పిచాయ్‌ను పదవి నుంచి తొలగిస్తే (Dismissal), ఇంకా మెచ్యూర్ అవ్వని స్టాక్ ఆప్షన్లన్నింటినీ ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. "గతంలో పిచాయ్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఆల్ఫాబెట్ సంస్థకు, దాని వాటాదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి" అని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.
ప్రపంచ స్థాయి గుర్తింపు
{{/usCountry}}మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ పిచాయ్‌ను పదవి నుంచి తొలగిస్తే (Dismissal), ఇంకా మెచ్యూర్ అవ్వని స్టాక్ ఆప్షన్లన్నింటినీ ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. "గతంలో పిచాయ్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఆల్ఫాబెట్ సంస్థకు, దాని వాటాదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి" అని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.
ప్రపంచ స్థాయి గుర్తింపు
{{/usCountry}}ఈ కొత్త ఒప్పందంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సీఈఓల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానానికి చేరుకోనున్నారు. టెక్ రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో పిచాయ్ నాయకత్వం కీలకమని బోర్డు భావిస్తోంది, అందుకే ఈ స్థాయిలో ప్రోత్సాహకాలను ప్రకటించింది.