అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు టెక్సాస్ ప్రభుత్వం షాకిచ్చింది. "టెక్సాస్ పౌరులకే తొలి ప్రాధాన్యం" (Texans Come First) అనే నినాదంతో గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా హెచ్-1బీ (H-1B) వీసాదారులను నియమించుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
'టెక్సాస్ నిధులు.. టెక్సాస్ ప్రజలకే'

రాష్ట్ర పౌరులకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
“టెక్సాస్ పన్ను చెల్లింపుదారులు మన వర్క్‌ఫోర్స్ శిక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ ఉద్యోగాలు మన టెక్సాస్ వాసులకే దక్కాలి” అని అబాట్ తన ఎక్స్ (X) వేదికగా స్పష్టం చేశారు.
ఫెడరల్ హెచ్-1బీ ప్రోగ్రామ్‌లో జరుగుతున్న దుర్వినియోగంపై వస్తున్న నివేదికలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. స్థానిక నిపుణులను నియమించుకోవడానికి సరైన ప్రయత్నాలు చేయకుండానే, కొన్ని సంస్థలు విదేశీ శ్రమను తక్కువ ధరకు వాడుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త నిబంధనలు ఇవే..
గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ విభాగాలు కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది:
ముందస్తు అనుమతి తప్పనిసరి: టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి లిఖితపూర్వక అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ సంస్థ లేదా యూనివర్సిటీ కొత్త హెచ్-1బీ దరఖాస్తులు చేయకూడదు.
నివేదిక సమర్పణ: మార్చి నెలలోగా తమ వద్ద ఉన్న హెచ్-1బీ ఉద్యోగుల వివరాలను, వారి స్వదేశం, వృత్తి వంటి సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించాలి.
స్థానికులకు అవకాశం: సదరు ఉద్యోగం కోసం స్థానిక టెక్సాస్ వాసులకు తగిన అవకాశం కల్పించామనే ఆధారాలను కూడా చూపించాల్సి ఉంటుంది.
ఎవరిపై ప్రభావం?
ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే టెక్సాస్‌లోని ప్రైవేట్ దిగ్గజాలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టెస్లా వంటి కంపెనీలు భారీగా హెచ్-1బీ ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగానికి మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రభుత్వ వర్సిటీల్లో పరిశోధనలు చేసే భారతీయ విద్యార్థులు, మేధావులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
చైనా టెక్ కంపెనీలపై నిషేధం
{{/usCountry}}ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే టెక్సాస్‌లోని ప్రైవేట్ దిగ్గజాలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టెస్లా వంటి కంపెనీలు భారీగా హెచ్-1బీ ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగానికి మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రభుత్వ వర్సిటీల్లో పరిశోధనలు చేసే భారతీయ విద్యార్థులు, మేధావులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
చైనా టెక్ కంపెనీలపై నిషేధం
{{/usCountry}}వీసా నిలుపుదలతో పాటు, చైనాకు చెందిన 26 టెక్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిషేధిస్తూ గవర్నర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్ ప్రజల డేటాను సేకరించి, రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసే శత్రు దేశాల ప్రయత్నాలను అడ్డుకోవడమే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ నిషేధిత జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అలీబాబా (Alibaba), షీన్ (Shein), టెము (Temu - PDD) తో పాటు హైసెన్స్ (Hisense) వంటి సంస్థలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఇతర విదేశీ శక్తులు టెక్సాస్ నెట్‌వర్క్‌లలోకి చొరబడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గత జనవరి 20న ఇచ్చిన ఆదేశాల మేరకు టెక్సాస్ సైబర్ కమాండ్ నిర్వహించిన ముప్పు అంచనా (Threat Assessment) ఆధారంగా ఈ కంపెనీలపై ఆంక్షలు విధించారు. అమెరికాలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.