...
...
Next Story

జియో హాట్‌స్టార్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 6- తెలుగులోనే స్ట్రీమింగ్!

టాప్ 10 జియో హాట్ స్టార్ ఓటీటీ సినిమాలు: ఈ రోజు అంటే నవంబర్ 09న జియో హాట్ స్టార్‌ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 10 సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో నితిన్, శ్రీలీల ఫ్లాప్ మూవీ రాబిన్ హుడ్ ఉండటం విశేషంగా మారింది. మరి ఏ సినిమాకు ఏ స్థానం వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 9, 2025, 13:36:56 IST
Advertisement
<p>జియో హాట్ స్టార్ టాప్ 10- ఈ రోజు అంటే నవంబర్ 09 న జియో హాట్ స్టార్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీలు, షోల పేర్లను మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ జాబితాలో ఏఐ ద్వారా చిత్రీకరించిన మహాభారతం కూడా ఉంది. మరి ఏ సినిమా ఏ స్థానంలో ఇక్కడ తెలుసుకుందాం. </p>

జియో హాట్ స్టార్ టాప్ 10- ఈ రోజు అంటే నవంబర్ 09 న జియో హాట్ స్టార్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీలు, షోల పేర్లను మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ జాబితాలో ఏఐ ద్వారా చిత్రీకరించిన మహాభారతం కూడా ఉంది. మరి ఏ సినిమా ఏ స్థానంలో ఇక్కడ తెలుసుకుందాం.

బిగ్ బాస్ 19- బిగ్ బాస్ 19 వీకెండ్ వార్‌లో నంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఫర్హానా భట్, నీలం గిరి, తాన్యా మిట్టల్‌కు హోస్ట్ సల్మాన్ ఖాన్ క్లాస్ పీకాడు. దీంతో ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో కూడా చాలా చర్చ జరుగుతోంది.

మిరాయి ఓటీటీ - ఈ జాబితాలో రెండవ స్థానంలో తెలుగు భాషా చిత్రం మిరాయి ఉంది. ఈ సినిమా ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రానికి 7.4 ఐఎండీబీ రేటింగ్ ఉంది. కాబట్టి ఈ సినిమా కచ్చితంగా చూసే తెలుగు సినిమాల్లో ఒకటిగా ఉంది.

పతి పత్నీ ఔర్ పంగా ఓటీటీ - జియో హాట్‌స్టార్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 జాబితాలో మూడవ స్థానంలో కలర్స్ కపుల్స్ రియాలిటీ షో పతి పత్నీ ఔర్ పంగా ఉంది. ఈ షో ముగింపు వైపు నడుస్తోంది.

మహాభారతం: ఒక క్రూసేడ్ ఓటీటీ- జియో హాట్‌స్టార్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో చూడాల్సిన దాంట్లో మహాభారతం కూడా ఉంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మహాభారతం నాలుగో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌ను ఏఐతో తెరకెక్కించారు.

కొత్త లోకా చాప్టర్ 1 చంద్ర ఓటీటీ- మలయాళ సూపర్ హీరో చిత్రం లోకా ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.8 ఉంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కొత్త లోక కచ్చితంగా చూడాల్సిన సినిమా.

ది ఫెంటాస్టిక్ 4 ఓటీటీ- అమెరికన్ సూపర్ హీరో చిత్రం ది ఫెంటాస్టిక్ 4 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7 ఉంది. తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయిన ది ఫెంటాస్టిక్ 4 కచ్చితంగా చూడాల్సిన మూవీగా ఉంది.

రాబిన్ హుడ్ ఓటీటీ- తెలుగు భాషా చిత్రం రాబిన్ హుడ్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 4.5 ఉంది. థియేటర్లలో ఫ్లాప్ అయిన రాబిన్‌హుడ్‌పై ఓ లుక్కేయొచ్చు.

లాఫ్టర్ చెఫ్స్ - కలర్స్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ షో మూడవ సీజన్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

సెర్చి ది నైనా మర్డర్ కేస్ ఓటీటీ- జియో హాట్‌స్టార్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో క్రైమ్ వెబ్ సిరీస్ సెర్చ్ ది నైనా మర్డర్ కేసు తొమ్మిదో ప్లేసులో ఉంది. 6.1 IMDb రేటింగ్ ఉన్న సెర్చ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతు కచ్చితంగా చూడాల్సినదిగా ఉంది.

ట్రేడ్ అప్ ఓటీటీ- ఈ జాబితాలో 10 వ స్థానంలో గేమ్ షో ట్రేడ్ అప్ ఉంది. ఈ షోకు నిశ్చయ్ మల్హాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe