అమృత్ భారత్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబ్‌బాద్, లింగంపల్లి, మధిర, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్ స్టేషన్లు ఉన్నాయి.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బేగంపేట్, హఫీజ్‌పేట్, కరీంనగర్, రామగుండం, శ్రీబాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్ రైల్వే స్టేషన్లతో సహా పలు స్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. హై-టెక్ సిటీ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, బుకింగ్ కౌంటర్, లిఫ్ట్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు పూర్తయ్యాయి. కొత్త స్టేషన్ భవనం, కొత్త ప్రవేశ ద్వారం, ప్లాట్‌ఫాం ఉపరితలం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు చేపట్టారు.
కాజీపేట జంక్షన్ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, సాధారణ వెయిటింగ్ హాల్ డెవలప్‌మెంట్, టాయిలెట్, లిఫ్ట్, ఎస్కలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన మెరుగుదల, కొత్త వరండా, ప్లాట్‌ఫాం ఉపరితల మెరుగుదల, ఏసీ వెయిటింగ్ హాల్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు చేపట్టారు. మధిర స్టేషన్‌లో పోర్టికో, ప్లాట్‌ఫాం షెల్టర్, ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, వెయిటింగ్ హాల్ అభివృద్ధి, టాయిలెట్, పార్కింగ్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సర్క్యులేటింగ్ ఏరియా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు చేపట్టారు.
మహబూబాబాద్ స్టేషన్‌లో స్టేషన్ భవనం, పోర్టికో, ఒకటో ప్లాట్‌ఫాం వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్, ప్రస్తుతం ఉన్న జనరల్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్, టాయిలెట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ప్లాట్‌ఫాంల వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్ ఉపరితలం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, లిఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు చేపట్టారు.
{{/usCountry}}మహబూబాబాద్ స్టేషన్‌లో స్టేషన్ భవనం, పోర్టికో, ఒకటో ప్లాట్‌ఫాం వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్, ప్రస్తుతం ఉన్న జనరల్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయిటింగ్ హాల్, టాయిలెట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ప్లాట్‌ఫాంల వద్ద ప్లాట్‌ఫాం షెల్టర్ ఉపరితలం, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, లిఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) పనులు చేపట్టారు.
{{/usCountry}}నల్గొండ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం షెల్టర్, వెయిటింగ్ హాల్ అభివృద్ధి, టాయిలెట్ బ్లాక్, ప్రస్తుత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB) లిఫ్ట్, సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన అభివృద్ధి, కొత్త ప్రవేశ ద్వారం, ప్రవేశ, నిష్క్రమణ గేటు, సైనేజ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు చేపట్టారు.