పెట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌ను అరెస్టు చేసి, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం అతని ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతని కస్టడీని కోరాలని దర్యాప్తు అధికారులు యోచిస్తున్నారు. మే 8న ఒక మైనర్ బాలిక తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన పోక్సో కేసులో శనివారం అరెస్టు అయ్యాడు బండి సాయి భగీరథ్. అతడి ఐఫోన్‌ను పెట్‌బషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తనపై కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న సాయి భగీరథ్‌ను శనివారం రాత్రి నర్సింగి సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ బృందం అరెస్టు చేసింది. సాయి భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం, అతడిని పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు సుమారు రెండు గంటల పాటు విచారించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డీసీపీ (కూకట్‌పల్లి) రితిరాజ్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు.
విచారణ అనంతరం రాత్రి సుమారు 11.30 గంటలకు, వైద్య పరీక్షల కోసం అతడిని మెడ్చల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం అతడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఆ తర్వాత అతడిని చర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
భగీరథ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను, అందులోని డేటా ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పోలీసులు పంపారు. ఈ డేటా అతడి నేరంతో ముడిపెట్టడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయా అనే ఆసక్తి నెలకొన్నది.
ఇదిలా ఉండగా ఈ కేసులో తదుపరి విచారణ కోసం సాయి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు సోమవారం ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. బాధితురాలు లైంగిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఉన్న నాలుగు ప్రదేశాలకు అతడిని తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. శనివారం నాడు పెట్‌బషీరాబాద్ పోలీసులు కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌తో కలిసి నాలుగు ప్రదేశాలను సందర్శించారు.
{{/usCountry}}ఇదిలా ఉండగా ఈ కేసులో తదుపరి విచారణ కోసం సాయి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు సోమవారం ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. బాధితురాలు లైంగిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఉన్న నాలుగు ప్రదేశాలకు అతడిని తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. శనివారం నాడు పెట్‌బషీరాబాద్ పోలీసులు కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌తో కలిసి నాలుగు ప్రదేశాలను సందర్శించారు.
{{/usCountry}}ఫిర్యాదులో బాధితురాలి తల్లి.. మరికొందరు వ్యక్తులు కూడా ఇందులో పాలుపంచుకున్నారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల పోలీసులు ఎఫ్ఐఆర్‌లో “బండి సాయి బగీరథ్ మరియు ఇతరులు” అని పేర్కొన్నారు. సాయి భగీరథ్ తరఫు న్యాయ బృందం కూడా సోమవారం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మరోవైపు భగీరథ్ విషయంలో 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకుని.. సేమ్ కంటెంట్‌తో భగీరథ్‌కు సపోర్ట్‌గా మాట్లాడారనే అనుమానంతో పెట్‌బషీరాబాద్ పోలీసులు కేసులు ఫైల్ చేశారు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు బయటపెట్టినవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.