...
...
Next Story

వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి - ఏపీలో మోస్తారు, తెలంగాణకు భారీ వర్ష సూచన..!

తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చు.

Published on: Jul 2, 2025, 09:47:43 IST
By , , Telangana, Hyderabad, Andhrapradesh
Prefer HTon Google
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరిత ఆవర్తన ప్రభావంతో…. వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన…

భారీ వర్ష సూచన
భారీ వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

రేపు (జూలై 3) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచిఒక మోస్తారు వర్షాలుకురిసే అవకాశంఉంది. ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ,సిద్ధిపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలన్నింటికి ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక హైదరాబాద్ లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచిమోస్తారు వర్షం లేదా ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు పడొచ్చు. 30 - 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఉపరితల గాలులు పశ్చిమ, నైరుతి దిశలో వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీలోనూ వర్షాలు:

మరోవైపు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ(జూలై 2) శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలుకురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్రలోని కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe