...
...
Next Story

మంత్రి కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున - కేసు కొట్టివేత

రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన కేసును హీరో నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. పరువు నష్టం దావా కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇటీవలే కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published on: Nov 13, 2025, 19:43:21 IST
Advertisement

మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున మధ్య నడుస్తున్న కేసుకు తెరపడింది. తాజాగా మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెబుతూ… ప్రకటన విడుదల చేయటంతో హీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో వేసిన క్రిమినల్‌ దావాను హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు.

కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున
కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

ఫిర్యాదుదారుడుగా ఉన్న హీరో నాగార్జున… సెక్షన్ 280 BNSS కింద కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్ ను అనుమతించిన కోర్టు… 13-11-2025వ తేదీన కేసును కొట్టివేస్తూ కేసును ముగించింది. ఫలితంగా ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు ఉపశమనం దొరికినట్లు అయింది.

ఇటీవలే మంత్రి సురేఖ ట్వీట్…

మంత్రి కొండా సురేఖ మంగళవారం రాత్రి తర్వాత ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేశారు. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

హీరో నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు.నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.

నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 2024 లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండించిన హీరో నాగార్జున… కోర్టులో కేసు వేశారు. ఇప్పటికే ఈ కేసులో హీరో నాగార్జునతో పాటు మంత్రి సురేఖ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks