హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (ICAR-IIOR) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 'సీడ్ హబ్ రివాల్వింగ్ ఫండ్ ప్రాజెక్ట్' కింద తాత్కాలిక ప్రాతిపదికన ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్-I, ఖాళీల సంఖ్య: 01 పోస్టు , నెలవారీ వేతనం: రూ. 30,000 ఇంటర్వ్యూ తేదీ: 16 జూలై, 2026 , రిపోర్టింగ్ సమయం: ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు మాత్రమే.
అభ్యర్థులు అగ్రికల్చర్, బోటనీ, లేదా క్రాప్ ప్రొడక్షన్ విభాగాల్లో బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సన్‌ఫ్లవర్, సాఫ్లవర్, కాస్టర్, నువ్వుల పంటల బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, పోస్ట్-హార్వెస్ట్ పనుల్లో 1 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా స్కిల్స్, పొలంలో బయోమెట్రిక్ డేటా నమోదు చేయగల ఫీల్డ్ ఎక్స్‌పోజర్ ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ (16.07.2026) నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ నియామకం పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి లోబడి ఉంటుంది. ప్రాథమికంగా ఏడాది పాటు నియమించి, అభ్యర్థి ప్రతిభ ఆధారంగా పొడిగిస్తారు. ఇంటర్వ్యూకి కనీసం ఐదుగురు అభ్యర్థులు హాజరైతేనే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య 20 దాటితే మొదట రాత పరీక్ష నిర్వహించి, షార్ట్‌లిస్ట్ అయిన వారికి అదే రోజు ఇంటర్వ్యూ చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఫోటోతో జూలై 16న నేరుగా ఐసీఏఆర్-ఐఐఓఆర్ (ICAR-IIOR), రాజేంద్రనగర్, హైదరాబాద్ కార్యాలయానికి హాజరుకావచ్చు. ఎలాంటి టీఏ/డీఏ చెల్లించరు.
{{/usCountry}}ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఫోటోతో జూలై 16న నేరుగా ఐసీఏఆర్-ఐఐఓఆర్ (ICAR-IIOR), రాజేంద్రనగర్, హైదరాబాద్ కార్యాలయానికి హాజరుకావచ్చు. ఎలాంటి టీఏ/డీఏ చెల్లించరు.
{{/usCountry}}