Telangana Weather Report : భానుడి భగభగలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ జిల్లాలకు వర్ష సూచన - అంచనాలు ఇలా

హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్న వివరాల ప్రకారం…. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని అంచనా.
దక్షిణ తెలంగాణలోని జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇవాళ ఉదయం 8 గంటలలోపు జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏప్రిల్ 17 ఉదయం 8 తర్వాత నుంచి ఏప్రిల్ 19 ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఏప్రిల్ 19వ తేదీనే పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
- ఏప్రిల్ 19 - 20: జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఏప్రిల్ 20 - 21: ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- ఏప్రిల్ 22 - 23 : రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ కోతకు వచ్చిన పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.7, మహబూబ్‌నగర్‌లో 42, రామగుండంలో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు కూడా ఉత్తర, దక్షిణ తెలంగాణలో కొన్నిచోట్ల ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది.