...
...
Next Story

ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న పలువురు మావోయిస్టులు - లిస్టులో కీలక నేతలు..!

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

Published on: Nov 22, 2025, 09:38:48 IST
Advertisement

ఓవైపు వరుస ఎన్ కౌంటర్లు… మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో కకావికలం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 30 మందికిపైగా మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమయ్యారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

కీలక నేతలు…!

మావోయిస్టుల లొంగుబాటు...! ప్రతీకాత్మక చిత్రం
మావోయిస్టుల లొంగుబాటు...! ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ లొంగిపోయే వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటారని తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులుగా ఉన్న రమేష్‌, అప్పాశి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధమైయ్యారని సమాచారం.

ఇటీవలే మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలను విడించారు. ఆయనే కాకుండా మల్లోజుల వేణుగోపాల్ కూడా మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు. వీరే కాకుండా…. చాలా మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఆయుధాలను వీడిచి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.

తాజాగా ఏపీలోని మారేడుమిల్లిలో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతగా పేరొందిన హిడ్మా ఎన్ కౌంటర్ అయ్యాడు. అతనే కాకుండా టెక్ శంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఏకకాలంలో ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులు కూడా అరెస్ట్ కాగా… వీరిని రిమాండ్ కు తరలించారు. ఉత్తర భారతం నుంచి దక్షణ భారతం వరకు కూడా ఎక్కడా కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks