తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. కేవలం సైన్స్ గ్రూపులకే కాకుండా.. మ్యాథ్స్, హ్యుమానిటీస్ (ఆర్ట్స్) విద్యార్థులకు కూడా కొత్త అసెస్‌మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ప్రాక్టికల్స్‌ను రెండు ఏళ్లూ నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కోసం కేటాయించారు. అంటే ప్రయోగాల ద్వారా మార్కులు సాధించే అవకాశం విద్యార్థులకు పెరుగుతుంది.
మ్యాథ్స్ పరీక్షా విధానంలోనూ భారీ మార్పు వచ్చింది. థియరీ కంటే 'యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్'కు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఉన్న 75 మార్కులను 60 మార్కులకు ఫైనల్ పరీక్షలో తగ్గించారు. ఏడాదికి 15 మార్కుల చొప్పున ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించారు. దీనివల్ల విద్యార్థులు లెక్కలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
హ్యుమానిటీస్ (Civics, Economics, History), భాషా విభాగాల్లో (Telugu, English, etc.) మార్కుల సరళిలో కూడా మార్పులు ఉంటాయి. ఫైనల్ పరీక్షలో 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయిస్తారు.
ఈ మార్పుల వల్ల లాభమేంటి?
ఫైనల్ పరీక్షల మార్కులు తగ్గించడం వల్ల విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బట్టీ పట్టే విధానం పోయి, ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకునే విధానం అలవడుతుంది. ఇంటర్నల్ మార్కులు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.
ఈ విద్యా సంవత్సరం నుండే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించి తమ ప్రిపరేషన్‌ను మార్చుకోవాలని సూచించారు.
{{/usCountry}}ఈ విద్యా సంవత్సరం నుండే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించి తమ ప్రిపరేషన్‌ను మార్చుకోవాలని సూచించారు.
{{/usCountry}}మరోవైపు తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్‌గా అమలు చేస్తోందని, ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న డిక్లరేషన్ మీద సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ప్రకటనను ఎట్టి పరిస్థితుల్లోనూ నోటరైజ్డ్ అఫిడవిట్‌గా పరిగణించరాదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ప్రకటనను సమర్పించడం కోసం ఏ విద్యార్థి గానీ, తల్లిదండ్రులు గానీ నోటరీని సంప్రదించాల్సిన అవసరం లేదు లేదా ఎలాంటి ఖర్చు భరించాల్సిన అవసరం లేదు.