...
...
Next Story

Qnet Scam : స్కీమ్‌లో చేర్పిస్తే డబ్బులు.. క్యూనెట్ కేసులో 32 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా రూ.కోట్లు మోసం చేస్తున్న క్యూనెట్ కేసులో 32 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు.

Published on: Mar 23, 2026, 20:50:05 IST
Advertisement

హాంకాంగ్‌కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ముడిపడి ఉన్న నాలుగు భారీ మోసాల కేసులకు సంబంధించి.. హైదరాబాద్ పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. ఈ క్యూనెట్ కేసులో భాగంగా భారీగా మోసం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా సైబర్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అరెస్టులు చేసింది.

క్యూనెట్ స్కామ్ కేసు
క్యూనెట్ స్కామ్ కేసు

విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, గోల్డ్ క్వెస్ట్, క్యూనెట్ అని కూడా పిలిచే క్యూఐ గ్రూప్ యాజమాన్యంలో ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సమావేశంలో తెలిపారు. ఆ కంపెనీ పైకి తనను తాను ఒక ఉత్పత్తి ఆధారిత వ్యాపారంగా ప్రదర్శించుకుంటున్నప్పటికీ, తెరవెనుక అక్రమ డబ్బు చలామణి పథకాన్ని నడుపుతోందని ఆరోపణలు ఉన్నాయి.

ఉపాధి కోరుకునే యువతతో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, గృహిణులను లక్ష్యంగా చేసుకుంటారు. అధిక రాబడి ఇస్తామని ఆశ చూపి, మోసం చేస్తారు. నమ్మకం సంపాదించిన తర్వాత.. బాధితులను హైటెక్ సిటీలోని వివిధ హోటళ్లకు ఆహ్వానించి, అక్కడ నిందితులు కంపెనీ పేరు వెల్లడించకుండా ఒక పెట్టుబడి పథకాన్ని వివరిస్తారు. రెండేళ్లలో రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు రాబడి వస్తుందని చెబుతారు. రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టేలా ఒప్పిస్తారు.

ఈ ఫ్రాడ్‌లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు మోసగాళ్లు. దీనిలో ప్రతి సభ్యుడు మరో ఇద్దరిని చేర్చుకోవడం ద్వారా ఒక చైన్ సిస్టమ్ ఏర్పరుస్తారని సజ్జనార్ వివరించారు. చేర్చుకునే వారిని అప్‌లైనర్లు అని, వారు చేర్చుకున్న వారిని డౌన్‌లైనర్లు అని పిలుస్తారు. అంతేకాకుండా వ్యక్తులు ఇప్పటికే ఉన్న సభ్యుని ద్వారా మాత్రమే ఈ పథకంలో చేర్చేలా ప్లానింగ్ ఉంటుంది. అందువల్ల ఇందులో జాయిన్ చేయడం అనేది మెయిన్ తీసుకుంటారు మోసగాళ్లు. తెలివిగా బురిడీ కొట్టింటి జాయిన్ చేయిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks