...
...
Next Story

NIT Warangal : నిట్ వరంగల్‌ నుంచి ఇంటర్న్‌షిప్ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు

NIT Warangal Internship : వరంగల్ నిట్ నుంచి ఇంటర్న్‌షిప్‌ నోటిఫికేషన్ జారీ అయింది.అర్హులైన అభ్యర్థులు… మార్చి 31వ తేదీ వరకు ఈ మెయిల్‌ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

Published on: Mar 21, 2026 05:29 PM IST
Advertisement

వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంటెక్ లేదా బీటెక్ లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఈ ఖాళీలకు ఈ-మెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

వరంగల్ నిట్ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ - వివరాలు

  • నోటిఫికేషన్ - నిట్, వరంగల్.
  • ఖాళీలు - ఇంటర్న్‌షిప్
  • మొత్తం ఖాళీలు - 03
  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్‌ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పని చేసిన అనుభవం ఉండాలి.
  • 30 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కొన్ని సడలింపులు ఉన్నాయి.
  • ఎంపికైన వారు 6 నెలల కాలానికి పని చేయాల్సి ఉంటుంది.
  • ఎంపికైన వారికి నెలకు రూ.8000 చెల్లిస్తారు.
  • దరఖాస్తు ప్రక్రియ - ఈమెయిల్‌ ద్వారా.
  • ఈమెయిల్ చిరునామా - sanjaya@nitw.ac.in
  • దరఖాస్తు చివరి తేదీ - 31 మార్చి 2026.(రాత్రి 11.59 గంటల వరకు)
  • ఎంపిక విధానం - ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • మొబైల్ నెంబర్ - 9861126947
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/

ఎన్‌ఐటీ వరంగల్‌ నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్
ఎన్‌ఐటీ వరంగల్‌ నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్

ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe