శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
చర్లపల్లి టు కొల్లం…!

చర్లపల్లి - కొల్లం-చర్లపల్లి (07107/07108) మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 07107 రైలు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) చర్లపల్లిలో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరుతుంది. మరునాడు రాత్రి 10గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇక 07108 ట్రైన్ నవంబర్…. 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో (బుధవారం) తెల్లవారుజామున 2.30గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు…నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంటు మీదుగా కొల్లంకు చేరుకుంటుంది.
నర్సాపూర్ టు కొల్లం….
మరోవైపు ఏపీలోని నర్సాపూర్ నుంచి కొల్లంకు 20 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్-కొల్లం (07105) రైలు…. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
{{/usCountry}}మరోవైపు ఏపీలోని నర్సాపూర్ నుంచి కొల్లంకు 20 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. నర్సాపూర్-కొల్లం (07105) రైలు…. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
{{/usCountry}}ప్రతి ఆదివారం ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇక కొల్లం-నర్సాపూర్ (07106) రైలు నవంబర్ 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30 జనవరి 6, 13, 20 తేదీల్లో ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ప్రతి ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు… పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి మీదుగా కాయంకులం స్టేషన్లలో ఆగుతుంది.
మచిలీపట్నం టు కొల్లం….
ఇక మచిలీపట్నం - కొల్లం మధ్య కూడా 10 ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయి. ట్రైన్ నెంబర్ 07101 రైలు నవంబర్ 14, 21, 28, డిసెంబర్ 26, జనవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సంబంధిత తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.
ఇక కొల్లం – మచిలీపట్నం (07102) రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 28, జనవరి 3 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట మీదుగా కాయంకులం స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.