...
...
Next Story

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ విడుదల.. అభ్యంతరాలుంటే తెలపండి!

తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ విడుదలైంది. అభ్యంతరాలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం ఇచ్చింది.

Published on: Dec 30, 2025 06:08 PM IST
Advertisement

ఉద్యోగాల భర్తీలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు.. తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్‌ విడుదల
స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్‌ విడుదల

అభ్యర్థి అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో సాధించిన మార్కులు, వెయిటేజీ ద్వారా సాధించిన మార్కులు, వారి స్థానికతకు సంబంధించిన అంశాలు సహా అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో (http://mhsrb.telangana.gov.in/) అందుబాటులో ఉంచామని బోర్డు వెల్లడించింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని బోర్డు కోరింది. అభ్యంతరాలను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేయాలని సూచించింది.

అభ్యంతరాలను అభ్యర్థి లాగిన్ ద్వారా మాత్రమే నమోదు చేయాలని, ఆఫ్‌లైన్‌లో పంపించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని బోర్డు స్పష్టం చేసింది. మల్టీ జోన్-I పరిధిలో ఎటువంటి పోస్టులు నోటిఫై చేయనందున, ఆ జోన్‌కు చెందిన అభ్యర్థులను పోస్టుల కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని వెల్లడించింది.

దరఖాస్తుదారులు తమ వివరాలను ధృవీకరించుకోవాలని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే MHSRB వెబ్‌సైట్‌లో వారి ఖాతాల్లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు తెలిపారు. అభ్యంతరాలను 05.01.2026న సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక అవకాశం మాత్రమే ఇస్తారు. దరఖాస్తుదారులు సమర్పించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ లింక్ క్లిక్ చేసి ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ చూడండి.

ఈ లింక్ క్లిక్ చేసి అభ్యంతరాలు ఉంటే తెలపండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe