...
...
Next Story

TG EAPCET Results : టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల - స్కోర్, ర్యాంక్ కార్డ్ డైరెక్ట్ లింక్ ఇదే

TG EAPCET 2026 Results : టీజీ ఎప్‌సెట్ 2026 ఫలితాల విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులు… వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 17, 2026 11:16 AM IST
Advertisement

TG EAPCET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ - 2026 (TG EAPCET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. పరీక్ష ముగిసిన అతి తక్కువ రోజుల్లోనే అత్యంత వేగంగా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

టీజీ ఈఏపీసెట్ 2026
టీజీ ఈఏపీసెట్ 2026

ఈసారి ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ (BiPC) కు 84,954 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

జేఎన్‌టీయూ నిపుణుల కమిటీ పర్యవేక్షణలో మల్టిపుల్ షిఫ్టుల మార్కులను నార్మలైజేషన్ (Normalisation) ప్రక్రియ ద్వారా లెక్కించి పారదర్శకంగా ర్యాంకులను కేటాయించారు. ఫలితాలతో పాటు రెండు విభాగాలకు సంబంధించిన టాప్-10 టాపర్స్ జాబితా… ఉత్తీర్ణత శాతాన్ని కూడా అధికారులు ప్రకటించారు.

ఇంజినీరింగ్‌ విభాగంలో 73.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్‌లో 156.63 మార్కులతో ఎం. రుషి టాప్ గా నిలిచారు. 148.70 మార్కులతో టాప్‌-2గా అన్షుల్, 147.05 మార్కులతో టాప్‌-3గా కడపకు చెందిన వంశీధర్‌రెడ్డి ఉన్నారు.

  • అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ విభాగంలో 73,294 మంది ఉత్తీర్ణత సాధించారు.
  • రాష్ట్రస్థాయి 1వ ర్యాంక్: ముక్కరం అహ్మద్ – ఈయన 150.17 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు.
  • రాష్ట్రస్థాయి 2వ ర్యాంక్: తాడూరి నివృత్త్ సాయి వెంకట్ – ఈయన 143.43 మార్కులతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
  • రాష్ట్రస్థాయి 3వ ర్యాంక్ : సాహితి గీతిక గునిథి – ఈమె 142.35 మార్కులు సాధించి మూడో ర్యాంకుతో పాటు బాలికల విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు.
  • రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్ : మయుక్ జయసింహ – ఈ అభ్యర్థి 139.78 మార్కులతో నాల్గో స్థానాన్ని సాధించారు.
  • రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్: అమైర్ అనాస్ – ఈయన 137.40 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకును కైవసం చేసుకున్నారు.

TG EAPCET 2026 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా…

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. విడతల వారీగా ఈ ప్రక్రియను చేపట్టి… విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీటు పొందే విద్యార్థులు… తప్పకుండా ఆయా కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. అన్ని దశలు పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.

ఈ లింక్ పై క్లిక్ చేసి TGEAPCET 2026 ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

ఈ లింక్ పై క్లిక్ చేసి TGEAPCET 2026 ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe