TS Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు బోర్డు నుంచి అప్డేట్ వచ్చేసింది.ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొంది.

మే 22వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్(సప్లిమెంటరీ) పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు.
తాజాగా విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు… రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌లో మార్పు లేదని భావిస్తే…. మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,123 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.
2026 ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16%) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఆన్లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ప్రిన్సిపాల్ ద్వారా లేదా బోర్డు హెల్ప్‌డెస్క్‌కు (helpdesk-ie@telangana.gov.in) ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు.
{{/usCountry}}ఆన్లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ప్రిన్సిపాల్ ద్వారా లేదా బోర్డు హెల్ప్‌డెస్క్‌కు (helpdesk-ie@telangana.gov.in) ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు.
{{/usCountry}}