...
...
Next Story

TGPSC OTR : ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ - ఓటీఆర్ గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..?

ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఓటీఆర్ అప్డేట్ గడువును పొడిగించింది. మార్చి 25వ తేదీలోపు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

Published on: Feb 23, 2026, 23:07:46 IST
Advertisement

ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఇదే చివరి ఛాన్స్…

టీజీపీఎస్సీ అలర్ట్
టీజీపీఎస్సీ అలర్ట్

అభ్యర్థులు తప్పకుండా వారి వివరాలను నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. తర్వాత మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని పేర్కొంది. https://www.tgpsc.gov.in ద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించింది.

తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివరాలు మార్చడానికి వీలుండదని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే OTR వివరాలనే భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తారు…. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లయ్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫోటో, సంతకం వంటివి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే ప్రక్రియ. దీనివల్ల ప్రతిసారీ వివరాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఉద్యోగ నోటిఫికేషన్‌కు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రూల్ ప్రకారం.. ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్‌లో మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks