ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ఇటీవలనే పూర్తి కాగా… అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. పరీక్ష తేదీని ప్రకటించారు.
మార్చి 29వ తేదీన ఎగ్జామ్…

ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తారు. టీఎస్‌టీ పోస్టులకు 20,097, ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులను భర్తీ చేస్తారు. డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెడికల్ పరీక్షలుంటాయి.